News
News
X

Kamareddy: కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ లో 2 రోజులుగా విజిలెన్స్ దాడులు

కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ లో రెండు రోజులుగా విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలపై అధికారులు దాడులు చేపట్టారు. 

FOLLOW US: 
 
కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ లో రెండు రోజులుగా విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై 2019లో  మున్సిపల్ శాఖ సీఎండీ, కలెక్టర్ కు బీజేపీ నాయకుల ఫిర్యాదు చేశారు. మూడు పాలకవర్గాలతో పాటు ప్రస్తుత పాలకవర్గం అవినీతిపై ఆరాతీస్తున్నారు విజిలెన్స్ అధికారులు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 2 రోజులుగా విజిలెన్స్ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. 

మున్సిపాలిటీలో అక్రమాలపై బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. మూడు పాలకవర్గాలతో పాటు ప్రస్తుత పాలకవర్గం అవినీతిపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కోట్ల రూపాయలను కొల్లగొట్టారని.... చేయని పనులకు కోట్లల్లో బిల్లులు పొందారని రెండువేల అంశాలతో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారులు.. ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్రమాలు జరిగిన తీరుపై విచారణ చేపట్టారు. దీంతో ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో ఆందోళన మొదలైoది.

విజిలెన్స్ విభాగం మాజీ డీఎస్పీపై ఏసీబీ అధికారుల సోదాలు
అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో హెచ్​ఎండీఏ విజిలెన్స్ విభాగం మాజీ డీఎస్పీ జగన్ నివాసంలో ఏసీబీ అధికారులు రెండ్రోజుల క్రితం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్​ హబ్సిగూడలోని ఆయన నివాసంతో పాటు బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లల్లో సోదాలు జరిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అతడిని అరెస్ట్ చేశారు. జగన్​తో పాటు అతని సెక్యూరిటీ గార్డు రామును సైతం అరెస్ట్ చేశారు.

హెచ్​ఎండీఏకు సంబంధించి ఓపెన్ ప్లాట్ విషయంలో కోటేశ్వరరావు అనే వ్యక్తి దగ్గరి నుంచి 4 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఈ దాడులు చేశారు. జగన్ నివాసంలో ఇంటికి సంబంధించిన పత్రాలతో పాటు 56 తులాల బంగారం గుర్తించారు. జగన్ బంధువులు, కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి జగన్ ఆస్తులు కూడబెట్టినట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 14 గంటల పాటు సోదాలు నిర్వహించారు. బోడుప్పల్, కొర్రెముల, జోడిమెట్లలో వెంచర్‌ వేసినట్లు అనిశా అధికారులు గుర్తించారు. బినామీ పేరుతో డీఎస్పీ జగన్ పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News Reels

Also Read: Minister KTR: వరంగల్ కు జెన్పాక్ట్ ఐటీ కంపెనీ... మంత్రి కేటీఆర్ తో జెన్పాక్ట్ బృందం భేటీ...

Also Read: Eatala Rajender: మా పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ మీద పోటీ చేస్తా.. నేను బయటకు రాలేదు.. వాళ్లే రాజీనామా చేయమన్నారు

Also Read: Child Labour Act: చిన్నారులు సినిమాల్లో నటించాలంటే.. కలెక్టర్ పర్మిషన్ ఉండాల్సిందే.. రెమ్యూనరేషన్ పైనా క్లారిటీ 

Published at : 16 Dec 2021 07:54 PM (IST) Tags: Kamareddy kamareddy municipal office vigilance rides

సంబంధిత కథనాలు

Sharmila Dharna ; పాదయాత్రకు అనమతి ఇచ్చే వరకూ ఆమరణ దీక్ష - ట్యాంక్ బండ్‌పై షర్మిల దీక్ష, అరెస్ట్ !

Sharmila Dharna ; పాదయాత్రకు అనమతి ఇచ్చే వరకూ ఆమరణ దీక్ష - ట్యాంక్ బండ్‌పై షర్మిల దీక్ష, అరెస్ట్ !

Breaking News Live Telugu Updates: ‘అబ్ కీ బార్ కిసాన్ కా సర్కార్’ నినాదంతో దేశ రాజకీయాల్లోకి - కేసీఆర్ వెల్లడి

Breaking News Live Telugu Updates: ‘అబ్ కీ బార్ కిసాన్ కా సర్కార్’ నినాదంతో దేశ రాజకీయాల్లోకి - కేసీఆర్ వెల్లడి

Revant On BRS : ఏపీ, తెలంగాణలను కలిపే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ - బీఆర్ఎస్ పోటీ కోసమేనని రేవంత్ ఆరోపణ !

Revant On BRS :  ఏపీ, తెలంగాణలను కలిపే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ - బీఆర్ఎస్ పోటీ కోసమేనని రేవంత్ ఆరోపణ  !

Warangal News : మందుల కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి, రోడ్డు ప్రమాదంలో తాత మనవరాలు మృతి!

Warangal News : మందుల కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి, రోడ్డు ప్రమాదంలో తాత మనవరాలు మృతి!

TRS To BRS: ఇక భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్, జెండా ఆవిష్కరణ - ఈసీకి కేసీఆర్ సంతకం చేసిన లేఖ

TRS To BRS: ఇక భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్, జెండా ఆవిష్కరణ - ఈసీకి కేసీఆర్ సంతకం చేసిన లేఖ

టాప్ స్టోరీస్

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు

JD Waiting For Party : విశాఖ నుంచి పోటీ ఖాయం - సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోకి ?

JD Waiting For Party :  విశాఖ నుంచి పోటీ ఖాయం - సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోకి ?

Sonu Sood New Car: సోనూసూద్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు, కాస్ట్ ఎంతో తెలుసా?

Sonu Sood New Car: సోనూసూద్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు, కాస్ట్ ఎంతో తెలుసా?