News
News
X

TS Minister Srinivas Goud: ఆలయం వద్ద మంత్రి చేయి పట్టుకుని వేడుకున్న బాలుడు - చలించిపోయిన మంత్రి ఏం చేశారంటే !

TS Minister Srinivas Goud: చదువుకోవాలని ఉందని, ఎలాగైనా అవకాశం కల్పించాలని కోరగా.. బాలుడి ఆవేదన, పరిస్థితి చూసిన మంత్రి చలించిపోయారు. తన వాహనంలో తీసుకెళ్లి బాలుడ్ని ప్రైవేట్ పాఠశాలలో చేర్పించారు.

FOLLOW US: 

TS Minister Srinivas Goud: మైసమ్మను దర్శించుకునేందుకు వెళ్లిన మంత్రి చేయి పట్టుకుని ఓ బాలుడు వేడుకున్నాడు. తనకు చదువుకోవాలని ఉందని, ఎలాగైనా అవకాశం కల్పించాలని కోరగా.. బాలుడి ఆవేదన, పరిస్థితి చూసిన మంత్రి చలించిపోయారు. వెంటనే స్పందించిన మనసున్న మంత్రి బాలుడ్ని అక్కున చేర్చుకున్నారు. తన వాహనంలో తీసుకెళ్లి బాలుడ్ని ప్రైవేట్ పాఠశాలలో చేర్పించారు. ఈ సంఘటన మహబూబ్​నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి..

మైసమ్మ దర్శనానికి మంత్రి.. 
ఈ బాలుడి పేరు విజయ్ కుమార్. తల్లిదండ్రులు మల్లెల వెంకటేష్, మల్లెల బుజ్జమ్మ. వీరిది కాకర్లపాడ్. ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేక బడికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో మహబూబ్ నగర్ జిల్లాలోని మైసమ్మ ఆలయం వద్ద కూల్ డ్రింక్స్ అమ్ముతున్నాడు. ఆదివారం నాడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మైసమ్మను దర్శించుకుని పూజలు చేసేందుకు వచ్చారు.  కూల్ డ్రింక్ విక్రయిస్తున్న బాలుడు విజయ కుమార్ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని చూసి వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళి చేయిపట్టుకుని నన్ను చదివించండి సర్ అంటూ ఏడుపు అందుకున్నాడు. పిల్లవాడి పరిస్థితి, చదువుకోవాలన్న కోరిక మంత్రిని కదిలించింది. చదువుకోవాలనే బాలుడి శ్రద్ధ, అందుకు పడుతున్న ఆవేదనను గమనించి వెంటనే బాలుడిని  తన వాహనంలో ఎక్కించుకున్నారు. తన పక్కనే  కూర్చోబెట్టుకుని అన్ని వివరాలు తెలుసుకున్నారు. అక్కడికక్కడే పట్టణంలో మంచి పేరున్న రిషి విద్యాలయం వాళ్లకు ఫోన్ చేసి బాలుడిని ఆరో తరగతి లో చేర్చుకుని హాస్టల్ వసతితి పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎంత ఖర్చు అయినా తాను భరిస్తానని తెలిపారు. 

దుస్తులు, వస్తువులు సైతం..
బాలుడు విజయ్ కుమార్‌కు అవసరమైన దుస్తులు, ఇతర వస్తువులన్నీ కొనాలని తన వ్యక్తిగత సిబ్బందిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఆ విద్యార్థి జీవితంలో స్థిరపడేలా చేస్తామని అంత వరకు తానే బాధ్యత తీసుకుంటానని మంత్రి తెలిపారు. తన సొంత బిడ్డలా చూసుకుని, అతడికి విద్యాబుద్ధులు అందిస్తామని తెలిపారు. బాలుడికి దుస్తులు, పుస్తకాలు, బూట్లు, ఇతర వస్తువులన్నీ ఇప్పించారు. బాలుడి తల్లితండ్రులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. బాలుడు తన వద్దకు వచ్చి అడిగిన విధానం, చదువు పట్ల బాలుడికి ఉన్న శ్రద్ధ తనను కదిలించి వేసిందని మంత్రి తెలిపారు. బాలుడు జీవితంలో ఉన్నతంగా స్థిరపడేలా చేస్తామన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు పేదల పట్ల ఉన్న అభిమానానికి బాలుడి బాధ్యత చిన్న ఉదాహరణ మాత్రమేనని స్థానికులు చెబుతున్నారు.

Also Read: Vikarabad Family Missing: వికారాబాద్ జిల్లాలో ఫ్యామిలీ మిస్సింగ్ కలకలం - భార్య ఆచూకీ దొరకడం లేదని భర్త, కుమార్తెలు అజ్ఞాతంలోకి

Published at : 27 Jun 2022 11:18 AM (IST) Tags: Education telangana Srinivas Goud TS Minister Srinivas Goud Srinivas Goud Helps A Poor Boy

సంబంధిత కథనాలు

Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు

Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు

Breaking News Telugu Live Updates: కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి 

Breaking News Telugu Live Updates: కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి 

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

టాప్ స్టోరీస్

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన

CM Jagan :  ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన

Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!

Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!

NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్‌తో - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రశాంత్ నీల్

NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్‌తో - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రశాంత్ నీల్