ఎమ్మెల్యేలకు పెత్తనం ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ ఓటమికి కేటీఆర్ అహంకారం, భూ దందాలే కారణమని ఆరోపించారు.
Kavitha Warns KTR: కేటీఆర్ అహంకారం వల్లే బీఆర్ఎస్ ఓటమి.. నాతో పెట్టుకోకంటూ కవిత డైరెక్ట్ వార్నింగ్
Kavitha Warns KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీఆర్ఎస్ చీఫ్ కవిత ఫైర్ అయ్యారు. కేటీఆర్ అహంకారం వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందని ఆరోపించారు.

- కవిత, కేటీఆర్‌కు
- కేసీఆర్‌పై కేటీఆర్ విమర్శలను కవిత గట్టిగా ప్రశ్నించారు.
- బీఆర్ఎస్ ఓటమికి కేటీఆర్ అహంకారం, భూదందాలే కారణమన్నారు.
- కాంగ్రెస్ కూడా భూకబ్జాలు, భూమాఫియాను కొనసాగిస్తుందని ఆరోపించారు.
Kavitha Warns KTR: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేటీఆర్ వర్సెస్ కవిత పోరు సోషల్ మీడియాకు ఎక్కింది. 'నాతో పెట్టుకోవద్దు' అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు, తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా వేదికగా నేరుగా వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలకు పెత్తనం ఇవ్వడమే కేసీఆర్ చేసిన తప్పంటూ ఒక వార్తాపత్రికలో వచ్చిన కేటీఆర్ వ్యాఖ్యల క్లిప్పింగ్‌ను పోస్ట్ చేసిన కవిత, ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక గుంటనక్కను విమర్శించినందుకే నాడు తనను పార్టీ నుంచి బయటకు పంపారని, మరి నేరుగా పార్టీ అధినేత కేసీఆర్‌నే విమర్శిస్తున్న నిన్నేం చేయాలని కేటీఆర్‌ను ప్రశ్నిస్తూ కవిత చేసిన పోస్టు వైరల్ అవుతోంది.
కేటీఆర్ ల్యాండ్ దందాలే ఓటమికి కారణం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ ఓడిపోలేదని కేటీఆర్ అహంకారపూరిత వైఖరి, అక్రమ సంపాదన, ల్యాండ్ దందాలే ఒకప్పటి గులాబీ పార్టీని పాతాళంలోకి నెట్టేశాయని కవిత ఘాటుగా ఆరోపించారు. ఫామ్‌హౌస్‌లు, అక్రమ అనుమతులు, ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తీసుకున్న నజరానాలు, క్విడ్ ప్రో కో దందాలు చేసి పార్టీ భవిష్యత్తును నాశనం చేశారని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఓ కార్యకర్త ఫోన్‌లో మాట్లాడుతూంటే.. పెండ్లామా..గర్ల్ ఫ్రెండా అని అవమానించారని, గతంలో ఎవరి కోసం పిల్లల్ని కన్నారని సహాయం కోసం వచ్చిన ఓ రైతు భార్యను అవమానిస్తూ మాట్లాడారని గుర్తుచేశారు. ఇవన్నీ కేటీఆర్ అహంకారాన్ని తెలియచేస్తున్నాయన్నారు. నిమజ్జనోత్సవ సమయంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంతగా బతిమాలుకొని పాటలు పాడించుకున్నారో దేవుడికే తెలుసంటూ సెటైర్లు వేశారు.
Also Read: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
గుంటనక్కల మైండ్ గేమ్‌లో
గుంటనక్కల మైండ్ గేమ్‌లో పడి కేటీఆర్ గుడ్డిగా వ్యవహరిస్తూ, స్వయంగా కేసీఆర్‌నే తప్పుబడుతున్నారని కవిత ఆరోపించారు. కూర్చున్న కొమ్మనే నరుక్కునే రీతిలో, సొంత వైఫల్యాలను కేసీఆర్ పైకి నెట్టివేస్తూ బీఆర్ఎస్‌కు కేటీఆరే పెద్ద గోతిని తవ్వుతున్నారని మండిపడ్డారు. తనతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. అయితే కేటీఆర్ నేరుగా ఇటీవల కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ కవిత మాత్రం విరుచుకుపడటం వెనుక తెర వెనుక రాజకీయం ఉందని భావిస్తున్నారు.
Also Read: ఫార్ములా-ఈ రేస్ కేసు.. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్ట్‌లు తాత్కాలికంగా సీజ్ !
కాంగ్రెస్ భూదోపిడీ
"బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూదోపిడీ జరిగిందని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అదే దోపిడీని కొనసాగిస్తుంది. రంగారెడ్డి జిల్లా కొంగరకుర్దు ఏ గ్రామంలోని సర్వే నంబర్లు 2 నుంచి 400 వరకు ఉన్న 580 ఎకరాలపై భూ మాఫియా కన్ను పడింది. అందులో ఇప్పటికే దాదాపు 150 ఎకరాలు కబ్జా చేశారు. వక్ఫ్ బోర్డు కింద ఉన్న 580 ఎకరాలను ప్రభుత్వ పెద్దల సహకారంతో దోచేస్తున్న ఖబ్జదారులపై ఫిర్యాదులు చేసినా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదు. వక్ఫ్ బోర్డుకు, ఆ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మధ్య వివాదం ఉండగా.. మధ్యలో బడా నిర్మాణ సంస్థలు, వాటి వెనక ఉండి అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని ముఖ్య నాయకులు భూ మాఫియాగా మారి భూములు కొట్టేస్తున్నారు" అని కవిత ఆరోపించారు.
Frequently Asked Questions
కవిత కేటీఆర్‌ను ఎందుకు హెచ్చరించారు?
బీఆర్ఎస్ ఓటమికి కవిత కేటీఆర్‌ను ఎందుకు బాధ్యుడిని చేశారు?
కేటీఆర్ అహంకారపూరిత వైఖరి, అక్రమ సంపాదన, ల్యాండ్ దందాలే బీఆర్ఎస్ ఓటమికి కారణమని కవిత ఆరోపించారు. ఇవి పార్టీ భవిష్యత్తును నాశనం చేశాయని అన్నారు.
కవిత కాంగ్రెస్ పార్టీపై ఏ ఆరోపణలు చేశారు?
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూదోపిడీని కాంగ్రెస్ కొనసాగిస్తుందని కవిత ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలోని వక్ఫ్ బోర్డుకు చెందిన 580 ఎకరాల భూమిని భూ మాఫియా దోచేస్తోందని అన్నారు.
ట్రెండింగ్ వార్తలు






















