Top Headlines Today: టీడీపీ నేత ధూళిపాళ్లపై హత్యాయత్నం కేసు! 'అభయ హస్తం' పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
Top 5 Telugu Headlines Today 17 November 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
AP Telangana News Today: టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్లపై హత్యాయత్నం కేసు నమోదు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొన్నూరు (Ponnuru) మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Former Mla Dhulipalla Narendra Kumar) పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ నెల 15న సంగం డెయిరీ వద్ద తమపై దాడి చేశారని ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురంకు చెందిన రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాము కంప్లయింట్ ఆధారంగా ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పాల విక్రయానికి సంబంధించి 14 శాతం బోనస్ ఇవ్వలేదని, మాట్లాడదామని డెయిరీ వద్దకు పిలిచి కర్రలు, హాకీ స్టిక్‌లతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
42 పేజీలు, 62 అంశాలు - 'అభయ హస్తం' పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో
Congress Manifesto Released: తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైంది. 42 పేజీల్లో 62 ప్రధాన అంశాలతో 'అభయ హస్తం' పేరుతో మేనిఫెస్టోను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. 6 గ్యారెంటీలు సహా తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, నూతన వ్యవసాయ విధానం, రైతు కమిషన్ ఏర్పాటు వంటి ప్రధాన హామీలుున్నాయి. 18 ఏళ్లు నిండి చదువుకునే ప్రతీ విద్యార్థిని ఓ ఎలక్ట్రిక్ స్కూటీ అందిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ సహా పాత బకాయిలు చెల్లింపు వంటి హామీలు ప్రధానంగా ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మేనిఫెస్టోలకు ఓట్లు రాలతాయా ? - ఫ్రీ పథకాల ప్రకటనలకు సిద్ధమైన బీజేపీ, కాంగ్రెస్ !
మంత్రాలకు చింతకాయలు రాలతాయా అనేది వెటకారం సామెత.. రాజకీయాల్లో మేనిఫెస్టోలకు ఓట్లు రాలయాతా అన్నది కూడా అంతే. అయితే రాజకీయ పార్టీలు మాత్రం మేనిఫెస్టోలు ప్రజాకర్షక పథకాలతో నింపేస్తున్నాయి. తెలంగాణలో కూడా అంతే. హోరాహోరీగా సాగుతున్న పోరులో రెండు, మూడు శాతం ఓట్లనైనా తమ వైపు తిప్పుకునేలా చేయడానికి రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. శుక్రవారం కాంగ్రెస్, శనివారం బీజేపీ మేనిఫెస్టోలను ప్రకటించనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనాకర్షక పథకాల వరాలను గుప్పిస్తున్న ప్రధాన పార్టీలు సుదీర్ఘంగా కసరత్తు చేసి పోటాపోటీ హామీలతో మ్యానిఫెస్టోలను ప్రకటిస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
గ్యారంటీలకు గాంధీలు - క్షమాపణలకు బంట్రోతులా ? కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం !
కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో యువత ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్సేనన్నట్లుగా గాంధీభవన్ లో చిదంబరం ( Chidambaram ) వ్యాఖ్యలు చేశారు. క్షమాపణలు చెప్పారు. ఈ అంశంపై కవిత సోషల్ మీడియా ద్వారా స్పందించారు. సోనియా, రాహుల్ గాంధీలు అమవీరుల స్థూపం ముందు మోకరిల్లినా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. పదేళ్లలో ఒక్కసారి కూడా గాంధీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తురాకపోవడం బాధాకరమన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మంత్రులకు నిరసన సెగ - దళిత యువకుడి ఆత్మహత్యపై దొమ్మేరులో ఉద్రిక్తత
తూ.గో జిల్లా కొవ్వూరు (Kovvuru) మండలం దొమ్మేరు (Domeeru)లో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్లెక్సీ వివాదంలో పోలీసులు తనను వేధించారనే మనస్తాపంతో ఎస్సీ యువకుడు మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు హోం మంత్రి తానేటి వనిత (Thaneti Vanitha), సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున (Meruga Nagarjuna), కలెక్టర్, డీఐజీ గ్రామానికి రాగా, స్థానికులు, మృతుడి స్నేహితులు, కుటుంబ సభ్యులు వారిని అడ్డుకున్నారు. ఘటనకు స్థానిక వైసీపీ నేతలు, పోలీసులే కారణమని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి