Top 5 Headlines Today: విశాఖ అభివృద్ధితో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారతాయన్న జగన్! కరోనా తాత వచ్చినా ఎదుర్కొంటామన్న హరీష్ రావు
Top 5 Telugu Headlines Today 1 August 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Top 5 Telugu Headlines Today 1 August 2023:
విశాఖ అభివృద్ధితో ఉత్తరాంధ్ర రూపు రేఖలు మారిపోతాయ్- ఇనార్బిట్ మాల్ భూమి పూజలో సీఎం జగన్
విశాఖతోపాటు ఉత్తరాంధ్ర రూపు రేఖలు మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు సీఎం జగన్. విశాఖలో ఏర్పాటు చేయబోతున్న ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన చేసిన ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు. సౌతిండియాలోనే అతి పెద్ద మాల్ విశాఖలో రాబోతుందన్నారు సీఎం జగన్. ఇది పూర్తై 8వేల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. విశాఖలోనే ఇంటర్‌నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకి కూడా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఇవన్నీ లైవ్‌లోకి వస్తే విశాఖతోపాటు ఉత్తారంధ్ర రూపు రేఖలే పూర్తిగా మారిపోతాయని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలు
ఏపీలో ఈడీ సోదాల కలకలం- టీడీపీ లీడర్ ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో నేతలకు సంబంధించిన ఆఫీస్‌లు, ఇళ్లపై రైడ్స్ జరగుతున్నాయి. తెలుగు దేశం నేత రాయపాటి సాంబశివరావుతోపాటు మలినేని సాంబశివరావు అనే వ్యాపారి ఇంట్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. మంగళవారం ఉదయం నుంచి రాయపాటి, మలినేని ఇళ్లు, ఆఫీస్‌లలో ఈడీ అధికారులు సోదాలు మొదలు పెట్టారు. వీళ్ల ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీలో లెక్కలపై ఈ తనిఖీలు చేస్తున్నారు. ఈ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లూ, ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, గుంటూరు సహా 9 ప్రాంతాల్లో టీంలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. పూర్తి వివరాలు
సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పుతో కొట్టుకున్న కౌన్సిలర్- వీడియో వైరల్
వార్డు కౌన్సిల్‌గా ఎన్నికై దాదాపు మూడేళ్లు అవుతున్నా తన ప్రజల కోసం ఏ చేయలేకపోతున్నానని ఆవేదనతో ఓ కౌన్సిలర్ చెప్పుతో కొట్టుకోవడం వైరల్‌గా మారింది. నర్సీపట్నం మున్సిపల్ సమావేశంలో జరిగిన ఘటన నేషల్ మీడియాలో కూడా మారుమాగిపోయింది. నర్సీపట్నం మున్సిపాలిటీలోని 20వ వార్డుకు చెందిన రామరాజు తన వార్డు సమస్యలు ప్రస్తావిస్తూ గిరిజన గ్రామ ప్రజలకు ఎలాంటి పనులు చేయలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు సరిగా లేవని, కుళాయిల్లో పూడిక తీయలేదని, చెత్తకు తరలించడం లేదని, వీధి దీపాలు కూడా వెలగడం లేదని ఆరోపించారు. పూర్తి వివరాలు
కరోనా కాదు దాని తాత వచ్చినా తెలంగాణ రెడీ- అంబులెన్సుల ప్రారంభోత్సవంలో హరీష్
తెలంగాణలో మరిన్ని అంబులెన్స్‌లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వాటిని సీఎం కేసీఆర్ జెండా ఊపి నెక్లస్ రోడ్డులోప్రారంభించారు. వీటిలో రెగ్యులర్ అంబులెన్స్‌లు 204 ఉంటే... అమ్మఒడి వాహనాలు 228 ఉన్నాయి. తెలంగాణ ఏర్పడినప్పుడు 75 లక్ష జనాభాకు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండేదని ఇప్పుడు దాన్ని 75వేలకు తగ్గించినట్టు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అంటే ప్రస్తుతం తెలంగాణలో 75 మంది జనాభాకు ఒక అంబులెన్స్ అందుబాటు ఉందన్నారు. పూర్తి వివరాలు
ఉద్యోగులకు శుభవార్త- ప్రయాణికులకు వాత, టికెట్ ధరలు పెంచిన టీఎస్ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ శుభవార్త చెప్పిన మరుసటి రోజే.. ప్రయాణికులకు షాక్ ఇచ్చింది ఆర్టీసీ యాజమాన్యం. హైదరాబాద్ డే పాస్ టికెట్ ధరను భారీగా పెంచేసింది. ఏకంగా 20 శాతం పెంచింది. ఇప్పటి వరకు డే పాస్ ధర రూ.100 ఉండగా.. ఇక నుంచి డే పాస్ ధరను రూ.120 కు పెంచింది ఆర్టీసీ. అలాగే మహిళలు, సీనియర్ సిటిజెన్స్ కు రూ.80 రూపాయలుగా ఉన్న డే పాస్ ధరను ఇప్పుడు రూ.100 రూపాయలకు పెంచింది. ఒకవైపు ఉద్యోగులపై వరాలజల్లు కురిపిస్తూ.. మరోవైపు ప్రయాణికులకు మాత్రం వాత పెడుతోందని.. సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు