అన్వేషించండి

TS News Developments Today: తెలంగాణకు కొత్త డీజీపీ వస్తారా? లేక తాత్కాలిక డీజీపీని నియమిస్తారా?

ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలిచేస్తూ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపటిలో సీబీఐ ఈ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

నేడు ముచ్చింతల్‌కు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. ఘన స్వాగతం పలకనున్న చిన్నజీయర్ స్వామి..

భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తెలంగాణలో పర్యటనలో భాగంగా నేడు సాయంత్రం ముచ్చింతల్ లోని శ్రీ రామానుజ సమాతమూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. దేశానికే సుప్రసిద్ధ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఖ్యాతి గడించిన ముచ్చింతల్ సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం అంగరంగ వైభవంగా ముస్తాబై రాష్ట్రపతి రాక కోసం ఎదురుచూస్తుంది. కట్టుదిట్టమైన పోలీసు బలగాల భద్రత ఏర్పాట్ల మధ్య ముచ్చింతలోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తెలంగాణలో పర్యటన భాగంగా గురువారం ముచ్చింతల్ లోని సమాతమూర్తి స్ఫూర్తి కేంద్రానికి సాయంత్రం 5:15 గంటలకి ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకుంటారు. అనంతరం రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు. తర్వాత రిఫ్రిస్మెంట్ పూర్తి చేసుకొని అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం గేట్ నెంబర్ 3 వద్దకు చేరుకుంటారు. అక్కడ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత భారత రాష్ట్రపతి ద్రౌపతి మూర్మును వెంట తీసుకుని 108 దివ్యసాలు సందర్శిస్తూ ఆలయ విశేషాలు తెలియచేస్తారు.- ఆ తర్వాత 216 అడుగుల రామానుజ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూసి అక్కడనుంచి రామానుజ స్వర్ణ విగ్రహాన్ని దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీ రామానుజ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎదురుగా ఏర్పాటుచేసిన డైనమిక్ ఫౌంటైన్ షో తిలకిస్తారు. చివరకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ త్రీడీ లేజర్ షో చూసిన తరువాత సందర్శకులని, భక్తులని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో రాష్ట్రపతి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంటారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు, సందర్శకులు పోలీసులకు, ఆలయ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

నేడు సిబిఐ ఏం చేస్తుంది? ఉత్కంఠగా ఎమ్మెల్యేల ఎర కేసు

ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసును సిట్ నుంచి సిబిఐ కి బదిలిచేస్తూ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. తీర్పు కాపీ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపటిలో సిపిఐ ఈ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 98 పేజీల తీర్పు కాపీ అందుకున్న సిబిఐ ఈ కేసులో ఏం చేయబోతుంది? ఏవర్ని విచారించనుంది అనేది ఉత్కంఠగా మారింది. 

నేడు డీజీపీ వార్షిక నివేదిక.. కొత్త డీజీపీ ఏవరు?

ఈ ఏడాదిగా రాష్ట్రంలో జరిగిన నేరాలు, ఘోరాలు, అదే విధంగా పోలీసుల పనితీరుపై డీజీపీ మహేందర్ రెడ్డి వార్షిక నివేదిక ఈ రోజు విడుదల చేయనున్నారు. మరోవైపు డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియనుండటంతో కొత్త డీజీపీగా ఎవరు వస్తారనేది పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నెలాఖరున ప్రస్తుత డీజీపీ పదవికాలం ముగుస్తుంది. సినియార్టీ ప్రకారం కొత్త డీజీపీ నియమిస్తారా? లేక తాత్కలిక డీజీపీ ని నియమిస్తారా? అనేది ఇవాళ, రేపటిలో తెలియనుంది. 

ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కన్వీనర్‌ కోటా.. సీట్లకు నేడు వెబ్‌ కౌన్సిలింగ్‌

ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ సీట్ల భర్తీకి కాను నేడు రెండవ విడత వెబ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. మొదటి విడత తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి బుధవారం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదలచేసింది. యూనివర్సిటీ పరిధిలోని ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈనెల 28న బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 29న గురువారం సాయంత్రం 6 గంటల వరకు తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్దులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్‌ జాబితా అదేవిధంగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. మరింత సమాచారం కోసం యూనివ ర్సిటీ వెబ్‌సైట్‌ డబ్ల్యు డబ్ల్యు. కెఎన్‌ఆర్‌ యుహెచ్‌ఎస్‌.తెలంగాణ.జీఓవి.ఇన్‌ను చూడవల్సిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget