అన్వేషించండి

Green Signal To Sharmila Padayatra : షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని షరతు !

షర్మిల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది.

Green Signal To Sharmila Padayatra :  వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. సీఎం కేసీఆర్, రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలు చేయవద్దు అని హైకోర్టు సూచించింది. షర్మిల తన పాదయాత్రలో భాగంగా ఎలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదని సూచిస్తూ, పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకం  సృష్టించారని ఆ పిటిషన్ లో  వైఎస్ఆర్‌టీపీ నేత రవీంద్రనాథ్  రెడ్డి  హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.  వైఎస్ షర్మిల  తన పాదయాత్రలో  సీఎం  కేసీఆర్ తో పాటు ప్రభుత్వ పెద్దలపై  వ్యక్తిగత విమర్శలు చేస్తుందని  అడ్వకేట్  జనరల్  గుర్తు  చేశారు. దీంతో  షరతులతో  కూడిన  అనుమతిని  హైకోర్టు అనుమతిని  ఇచ్చింది.    పాదయాత్రకు మరోసారి  ధరఖాస్తు  చేసుకోవాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ  చేసింది. 

వరంగల్ జిల్లా నర్సంపేట వద్ద పాదయాత్రపై దుండగులు దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కారణంగా షర్మిల పాదయాత్రను నిలిపివేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌లో వదిలి పెట్టారు.  పాదయాత్రకు అన్ని అనుమతులు ఉన్నాయని.. అయినా  పోలీసులు అరెస్ట్ చేశారని హైకోర్టులో వైఎస్ఆర్‌టీపీ నాయకులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. 

మరో వైపు పాదయాత్రలో తనపై జరిగిన దాడులకు నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి షర్మిల చేసిన ప్రయత్నం ఉద్రిక్తతలకు దారి తీసింది.ఉదయం ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన షర్మిలను పంజాగుట్ట వద్ద అడ్డుకుని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  షర్మిల తో పాటు మరో 20 మందిని పోలీసులు పీఎస్ ల నిర్భందించారు. మొబైల్ ఫోన్స్ లాక్కుని పీఎస్ లోనే కూర్చోబెట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్గించారని  షర్మిల పై పంజాగుట్ట పీఎస్ లో మూడు సెక్షన్ల కింద  పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిల అరెస్ట్ తో ఎస్సార్ నగర్ పీఎస్ వద్దకు ఆమె అభిమానులు భారీగా చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు.దీంతో ఎస్సార్ నగర్  పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

,పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో షర్మిల ఎక్కడ పాదయాత్ర ఆగిందో మళ్లీ అక్కడి నుంచే ప్రారంభించే అవకాశం ఉంది. . అయితే మళ్లీ పాదయాత్ర ఎప్పటి నుండి ప్రారంభమవుతుందన్నదానిపై వైఎస్ఆర్‌టీపీ వర్గాలు ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు.  షర్మిల చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటి వరకూ మూడున్నర వేల కిలోమీటర్ల వరకూ నడిచారు.  షర్మిల తల్లి విజయలక్ష్మి కూడా.. కొన్ని చోట్ల పాదయాత్రలో పాల్గొని తమ కుమార్తెకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. 

వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత, విజయమ్మను అడ్డుకున్న పోలీసులు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Brothers As DGPs: దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

MS Dhoni IPL 2024 Retirement | మహేంద్ర సింగ్ ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజనా.? | ABP DesamSRH Captain Pat Cummins IPL 2024 | కమిన్స్ రాకతోనైనా ఆరెంజ్ ఆర్మీ ఆకట్టుకుంటుందా.? | ABP DesamPinkvilla Screen And Style Awards: ముంబయిలో ఘనంగా జరిగిన అవార్డుల వేడుక, విభిన్న డ్రెస్సుల్లో తారలుRajamouli Mahesh Babu Movie: జపాన్ లో RRR స్క్రీనింగ్స్ సందర్భంగా మహేష్ మూవీ అప్డేట్ ఇచ్చిన జక్కన్న

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Brothers As DGPs: దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Iswarya Menon Photos:  పింక్ శారీలో ఐశ్వర్య మీనన్ ని చూస్తే రెప్పవేయడం మర్చిపోతారంతే!
Iswarya Menon Photos: పింక్ శారీలో ఐశ్వర్య మీనన్ ని చూస్తే రెప్పవేయడం మర్చిపోతారంతే!
Sriram: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
Supreme Court  : చంద్రబాబు  బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా - ఏప్రిల్ 16న మళ్లీ విచారణ !
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా - ఏప్రిల్ 16న మళ్లీ విచారణ !
Home Loan: క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
Embed widget