అన్వేషించండి

Land For BRS : కోకాపేటలో బీఆర్ఎస్‌కు 11 ఎకరాలు - రహస్యంగా ఇచ్చేశారని విమర్శలు !

కోకాపేటలో బీఆర్ఎస్‌కు 11 ఎకరాలను చాలా తక్కువ రేటుకు కేటాయించింది ప్రభుత్వం. దీనిపై దుమారం రేగుతోంది.


Land For BRS :    భారత రాష్ట్ర సమితికి కేసీఆర్ ప్రభుత్వం 11 ఎకరాల భూమిని కోకాపేటలో కేటాయించింది. ఈ కేటాయింపులు పూర్తయిపోయిన తర్వాతే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పుడీ విషయం రాజకీయంగా సంచలనం అవుతోంది. 

కోకాపేటలో బీఆర్ఎస్ ఇనిస్టిట్యూట్‌కు 11 ఎకరాలు
 
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో 11 ఎకరాలను భారత్ రాష్ట్ర సమితికి  కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.  కేవలం రూ.37.53 కోట్లకే ముట్టజెప్పేందుకు అంగీకారం తెలిపింది. కొత్త సెక్రటేరియెట్​లో గురువారం జరిగిన కేబినెట్​ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ బయటకు తెలియలేదు.  కేబినెట్​లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రులు కూడా బీఆర్ఎస్​కు 11 ఎకరాల భూమిని కేటాయించిన విషయం చెప్పలేదు.  శుక్రవారం సర్క్యులర్ జారీ అయినప్పటికీ, అది కూడా బయటకు రాలేదు. అధికార పార్టీ వ్యవహారం కావడంతో ఫైల్ పంపించడం, ఆమోదం తెలపడం, సర్క్యులర్ జారీ కావడం.. అంతా సీక్రెట్ గా జరిగిపోయాయి.  

శిక్షణా కార్యక్రమాల కోసం ఇనిస్టిట్యూట్ పెట్టనున్న బీఆర్ఎస్ 

ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, విద్యావేత్తలకు శిక్షణ, పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోసం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అండ్ హ్యూమన్ రీసోర్స్ సెంటర్ పెడతామని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.  బీఆర్ఎస్ నుంచి దరఖాస్తు అందిన వారం రోజుల్లోనే ఫైల్ క్లియర్ అయిపోయింది.  రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని 239, 240 సర్వే నంబర్లలో భూమి కేటాయించాలని కలెక్టర్ ను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్.. కోకాపేటలో 239, 240 సర్వే నంబర్లలోని 11 ఎకరాల  భూమిని హెచ్​ఎండీఏ ద్వారా ఇప్పించాలని ఈ నెల 16న సీసీఎల్​ఏకు ప్రతిపాదనలు పంపించారు.  ఆ సర్వే నంబర్లలో ప్రస్తుతం ఎకరా ధర మార్కెట్  రేటు ప్రకారం రూ.3 కోట్ల 41 లక్షల 25 వేలు ఉందని.. 11 ఎకరాలకు రూ.37 కోట్ల 53 లక్షల 75 వేలు అవుతుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు వచ్చిన తర్వాతి రోజే అంటే పదిహేడో తేదీన  సీసీఎల్ఏ ఆ ఫైల్ ను తెలంగాణ స్టేట్ డెలవప్‌మెంట్ అధారిటీకి పంపారు.  ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే  భూమిని భారత రాష్ట్ర సమితికి అప్పగించాలని  టీఎస్ఎల్ఎంఏ కూడా వెంటనే సిఫార్సు చేసింది. టీఎస్​ఎల్ఎంఏ ప్రతిపాదనలపై గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించారు.  శుక్రవారం బీఆర్ఎస్‌కు  భూమిని కేటాయిస్తూ సర్క్యూలర్ ారీ ఏయింది.  

కారు చౌకగా తీసుకున్నారని  బీఆర్ఎస్‌పై విమర్శలు 

కోకాపేటలో ఇటీవల నిర్వహించిన వేలంలో ఒక్కో ఎకరం రూ.50 కోట్లకు అమ్ముడు పోయింది. అంటే 11 ఎకరాలకు రూ.550 కోట్లు అవుతుందన... కానీ ఇంత విలువైన భూమిని రూ.37.53 కోట్లకే తమ పార్టీకి ప్రభుత్వం కట్టబెట్టిందని విమర్శలు వస్తున్నాయి.  అప్పుడెప్పుడో 2008లో కాంగ్రెస్  కు​ భూమి ఇచ్చినట్టే బీఆర్ఎస్​ కు ఇస్తున్నామని సర్క్యులర్ లో పేర్కొన్నారు.    తిరుమలగిరి మండలం బోయిన్​పల్లిలోని 502, 503, 502/పీ2 సర్వే నంబర్లలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్​ కు 10 ఎకరాల 15 గుంటలు కేటాయించారు. ఇప్పుడు బీఆర్ఎస్​ కు అదే పద్ధతిలో 11 ఎకరాలు కేటాయిస్తున్నాం” అని తెలిపింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Hemant Soren: ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bachhala Malli Teaser: 'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
Embed widget