అన్వేషించండి

TGRTC Drivers: తెలంగాణలో ఆర్టీసీ డ్రైవర్లు మొబైల్ వాడకంపై నిషేధం, నేటి నుంచి అమలు

Mobiles banned for RTC Drivers | తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. డ్యూటీలో ఉంటే డ్రైవర్లు సెల్‌ఫోన్ వాడకంపై నిషేధం విధించారు. నేటి నుంచి పైలట్ ప్రాజెక్టు అమలవుతోంది.

Telangana RTC News Today | హైదరాబాద్‌: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ప్రధాన లక్ష్యంగా, ఆర్టీసీ సంస్థ నూతన చర్యలు చేపడుతోంది. డ్రైవర్లు సెల్‌ఫోన్‌ వాడకంతో ప్రమాదాలు సంభవిస్తున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని, వాటిని నిరోధించేందుకు సంస్థ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు సెల్‌ఫోన్‌ను వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. తాజా నిబంధనలు రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ప్రాథమికంగా, రాష్ట్రంలోని 11 రీజియన్లలో ఒక్కో డిపోను పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేశారు. 

ఈ ప్రాజెక్ట్‌ ఫలితాల ఆధారంగా, దశల వారీగా మిగిలిన అన్ని డిపోల్లో డ్రైవర్లకు సెల్‌ఫోన్ వాడకంపై నిషేధం అమలు చేయనున్నారు. డ్రైవర్‌ విధుల్లో చేరేముందు, తన సెల్‌ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేసి, డిపోలోని సెక్యూరిటీ అధికారికి ఆఫీస్‌ వద్ద డిపాజిట్‌ చేయాలి. విధులు ముగిసిన తర్వాత మాత్రమే తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. అత్యవసర సందర్భాల్లో డ్రైవర్‌ను సంప్రదించడానికి, ప్రతి డిపోలో ప్రత్యేక సెల్‌ఫోన్‌ నంబర్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ నంబరుకు కాల్‌ చేసి సమాచారం అందిస్తే, సంబంధిత బస్సు కండక్టర్‌ ద్వారా డ్రైవర్‌తో సంప్రదించే వీలుంటుంది.

సెల్‌ఫోన్ వాడకంపై నిషేధం అమలు చేసే డిపోలు, వాటి రీజియన్లు
ఉట్నూర్‌ (ఆదిలాబాద్‌), కామారెడ్డి (నిజామాబాద్‌), జగిత్యాల (కరీంనగర్‌), పరకాల (వరంగల్‌) ఖమ్మం (ఖమ్మం), కూకట్‌పల్లి (సికింద్రాబాద్‌), ఫరూక్‌నగర్‌ (హైదరాబాద్‌), వికారాబాద్‌ (రంగారెడ్డి), కొల్లాపూర్‌ (మహబూబ్‌నగర్‌), సంగారెడ్డి (మెదక్‌), మిర్యాలగూడ (నల్గొండ).

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

KTR Revanth Globarena: గ్లోబరీనా వివాదం - రేవంత్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు.. తీవ్ర వ్యాఖ్యలు!
గ్లోబరీనా వివాదం - రేవంత్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు.. తీవ్ర వ్యాఖ్యలు!
Bellampally MJP School Food Poisoning: బెల్లంపల్లి బీసీ గురుకులంలో మళ్లీ ఫుడ్ పాయిజన్ - 30 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత.. తల్లిదండ్రుల ఆందోళన!
బెల్లంపల్లి బీసీ గురుకులంలో మళ్లీ ఫుడ్ పాయిజన్ - 30 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత.. తల్లిదండ్రుల ఆందోళన!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget