Gig Workers Good News: గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్- రూ.5 లక్షల లబ్ధి, జీవో జారీ
Telangana CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ.5 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తామని జీవో జారీ చేశారు.
Accidental Insurance to Gig workers: హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. గత వారం గిగ్ వర్కర్లకు ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సరిగ్గా వారానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తూ శనివారం నాడు (డిసెంబర్ 30న) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రజాపాలన గ్రామ సభల్లో గిగ్ వర్కర్లు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం వారికి సూచించింది.
తెలంగాణ ప్రభుత్వం తమకు ప్రమాద బీమా కల్పిస్తూ జీవో జారీ చేయడంపై గిగ్ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఫుడ్ డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల మేర యాక్షిడెంటల్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని డిసెంబర్ 23న నాంపల్లిలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాటిచ్చారు. సరిగ్గా వారానికి గిగ్ వర్కర్లకు ప్రమాద బీమా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో జారీ చేశారు.
వారికి యాక్సిడెంటల్ పాలసీ..
క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ ప్రకటించారు. దాంతో పాటు వీరికి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. టీ హబ్ ద్వారా ఒక యాప్
అదేవిధంగా క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరిగా టీ హబ్ ద్వారా ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
గత శనివారం (డిసెంబర్ 23న) నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడానికి నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన.. వారు లేవనెత్తిన అంశాలనుం పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాజస్థాన్ లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమర్ధవంతమైన చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. సామాజిక రక్షణ కల్పించడంలో మా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: HCA అక్రమాలపై విచారణ - కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్ కు ఈడీ నోటీసులు