Telangana: నటిపై కామెంట్స్- కొండా సురేఖపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోదా ? ఇదిగో క్లారిటీ
Konda Surekha Telugu News Updates | నటి సమంతపై దారుణవ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై తెలంగాణ మహిళా కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందని చర్చ జరిగింది.
Konda Surekha Comments Against Samantha | హైదరాబాద్: టాలీవుడ్ నటుడు నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన దారుణ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి. ముఖ్యంగా సినీ నటి సమంతపై ఆమె చేసిన కామెంట్లపై అటు రాజకీయ పక్షాలు, ఇటు టాలీవుడ్ సెలబ్రిటీలు మండిపడుతున్నారు. మహిళపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి కొండా సురేఖపై తెలంగాణ మహిళా కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ నటి సమంతపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ స్పందించింది. కొండా సురేఖపై ఎలాంటి చర్యలు ఉండవు అని తెలంగాణ మహిళా కమిషన్ స్పష్టం చేసింది.
కొండా సురేఖ వ్యాఖ్యలు, అనంతరం జరిగిన పరిణామాలను నిశితంగా పరిశీలించామని కమిషన్ పేర్కొంది. రాజకీయ కోణంలో తాను కొన్ని అవాంఛిత వ్యాఖ్యలు చేసినందుకు కొండా సురేఖ భేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని కమిషన్ చెప్పింది. నటి సమంతను తాను కించపరచాలని అనుకోలేదని మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చినట్లు గుర్తుచేసింది. సమంతపై తాను చేసిన వ్యాఖ్యలకు గానూ కొండా సురేఖ క్షమాపణలు చెప్పకపోయి ఉంటే మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించేదన్నారు. కనుక ప్రస్తుతం ఈ వ్యవహారంలో మహిళా కమిషన్ పాత్ర అవసరం లేదని అభిప్రాయపడింది. మరోవైపు నటుడు నాగార్జున కుటుంబం లీగల్ నోటీసు ఇవ్వడం, వారి వ్యక్తిగత అంశమని మహిళా కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Also Read: మహేష్ జోక్యంతో వెనక్కి తగ్గిన కొండా సురేఖ- కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్