అన్వేషించండి

Defecting MLAs: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయానికి మరో రెండు నెలల గడువు- సుప్రీంను కోరిన తెలంగాణ స్పీకర్

Telangana: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. స్పీకర్ మరో 2 నెలల గడువు సుప్రీంకోర్టును కోరారు.

Telangana Speaker defecting MLAs Issue: తెలంగాణ అసెంబ్లీలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులపై సుప్రీంకోర్టు నిర్ణయించిన మూడు నెలల గడువు ముగిసింది.  స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇంకా  నిర్ణయం తీసుకోలేదు. జూలై 31న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం, అంటి-డిఫెక్షన్ చట్టం కింద దాఖలైన పిటిషన్లపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశించింది. ఆరుగురు ఎమ్మెల్యేల విచారణ షెడ్యూల్ ఇంకా విడుదల చేయలేదు.  మిగతా విచారణలకు మరో రెండు నెలల (8 వారాల) సమయం కోరుతూ సుప్రీంకోర్టును స్పీకర్ అభ్యర్థించారు 

2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌లోంచి కాంగ్రెస్‌లోకి  పది మంది  ఫిరాయించారు. వీరిపై అనర్హతా వేటు వేయాలని  బీఆర్ఎస్ ఎమ్మెల్యే పి. కౌశిక్ రెడ్డి   స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్లపై స్పీకర్ విచారణలు జరుగుతున్నాయి. స్పీకర్ ఇప్పటివరకు నలుగురు ఎమ్మెల్యేల విచారణలు పూర్తి చేశారు. మిగతా ఆరుగురి విషయంలో షెడ్యూల్ విడుదల కాలేదు.   జూలై 31న జస్టిస్ బెంచ్ జారీ చేసిన తీర్పులో ఎమ్మెల్యేలు విచారణను వాయిదా వేయకూడదు. మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి అని ఆదేశించింది.  అక్టోబర్ 24 నుంచి   చేసిన విచారణలు కూడా పూర్తి కాకపోవడంతో, స్పీకర్ మిగతా కేసులకు 'విస్తృత విచారణ అవసరం' అని చెబుతూ మరో 8 వారాల సమయం కోరారు.  ఈ అభ్యర్థనపై సుప్రీంకోర్టు త్వరలో విచారణ జరుపనుంది. 

ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం తెలంగాణోల వివాదాస్పదంగా మారింది. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు కానీ సాంకేతికంగా వారు బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నారు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వారు పార్టీ మారితే స్పీకర్ అనర్హతా వేటు వేయాల్సి ఉంటుంది. అయితే నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలన్నది స్పీకర్ ఇష్టం. గడువు లేదు. దీనిపై సుప్రీంకోర్టు.. స్పీకర్ కు మూడు నెలల గడువు పెట్టింది. విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. విచారణ నెమ్మదిగా సాగుతోంది. మొదట అందరికీ ..అంటే ఫిరాయించిన పది మందికి నోటీసులు జారీ చేశారు. వారిలో ఎనిమిది మంది మాత్రమే వివరణ ఇచ్చారు. కడియం శ్రీహరితో పాటు దానం నాగేందర్ ఎలాంటి వివరణలు ఇవ్వలేదు. వారు ఇంకా గడువు కోరుతున్నారు.

మరోవైపు మిగతా ఎనిమది మంది మాత్రం తాము పార్టీ మారామని ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. సీఎంను మర్యాదపూర్వకంగా కలిశామని.. తాము పార్టీ మారలేదని.. చెబుతున్నారు. పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని అంటున్నారు. వారు కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దానం నాగేందర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. కడియం శ్రీహరి కుమార్తె కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచారు. ఈ క్రమంలో .. అసలు ఉపఎన్నికలు రాకుండా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సుప్రీంకోర్టు గడువు ఇస్తే.. ఆ రెండు నెలల తర్వాత అయినా ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.              

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
KBR Park Elevated Corridors: కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget