Alair Police Station : దేశంలోని టాప్ 5 పోలీస్ స్టేషన్లలో ఒకటి ఆలేరు - ఆ పీఎస్ ప్రత్యేకతలేమిటో తెలుసా ?
దేశంలో ఉత్తమమైన పోలీస్ స్టేషన్లలో ఆలేరు ఐదో స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ధృవీకరణ పత్రం పంపింది.
దేశంలో అత్యుత్తమమైన పోలీస్ స్టేషన్ల ( Best Police Stations ) జాబితాలో తెలంగాణలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఆలేరుకు ( Aler PS ) ఐదో స్థానం దక్కింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన దేశంలోని 75 ఉత్తమ పోలీస్స్టేషన్ల జాబితాలో ఆలేరు పోలీసు స్టేషన్ 5వ స్థానం ( TOP Five ) దక్కించుకుంది. పోలీసు స్టేషన్ల పనితీరు, మౌలిక సదుపాయాల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. పౌరుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ ఎక్సలెన్సీ సర్టిఫికెట్ కూడా పంపించింది.
నరకంలాగా ఏపీ, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు - ‘నేనేం డబ్బా కొట్టట్లేదు, అన్నీ నిజాలే’నంటూ కామెంట్స్
2020 - 21 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ పోలీసు స్టేషన్ అవార్డులు ఇచ్చేందుకు కేంద్ర హోంశాఖ ( MHA ) దేశ వ్యాప్తంగా 16,671 పోలీసు స్టేషన్లతో కేంద్రం ఓ ప్రాథమిక జాబితాను రూపొందించింది. ఈ జాబిాలో తెలంగాణ నుంచి సైనత్ నగర్ , బయ్యారం, ఆలేరు ఠాణాలకు చోటు దక్కింది. పోలీసు స్టేషన్ల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించడం, నేరాలు జరగకుండా ముందస్తు కట్టడి, సంఘ విద్రోహశక్తులను అదుపు చేసేందుకు తీసుకున్న చర్యల వంటి అంశాలను పరిశీలించిన కేంద్ర హోంశాఖ ఈ జాబితాను రూపొందించింది. వడపోత అనంతరం టాప్ 75 పోలీస్ స్టేషన్లకు ఎంపిక చేశారు. వీటిలో ఐదో స్థానంలో ఆలేరు నిలిచింది.
ఏపీ అభివృద్ధిని ఓర్వలేకనే కేటీఆర్ వ్యాఖ్యలు - వైఎస్ఆర్‌సీపీ నేతల విమర్శలు !
ఆలేరు పోలీస్ స్టేషన్‌ను 1998లో ఏర్పాటు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం నేరాల కట్టడిలో ఆలేరు స్టేషన్ సిబ్బంది ఎప్పుడూ ప్రత్యేకంగా ప్రశంసలు పొందుతున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చిన తర్వాత వారి పనితీరు మరింత మెరుగుపడింది. కమిషనర్ మహేష్ భగవత్ ( Mahesh Bhagavat ) ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కేంద్ర బృందం సౌకర్యాల పరిశీలనకు వచ్చినప్పుడు .. ఆలేరు పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవ.. నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలు... నమోదైన కేసులను చురుగ్గా దర్యాప్తు చేస్తున్న వైనం అన్నింటినీ పక్కాగా వివరించారు. ఈ కారణంగా ఆలేరు పోలీసులకు అరుదైన ఘనత లభించింది.
ఇది ట్రైలరే, సినిమా ముందుంది - నితిన్ గడ్కరీ, హైదరాబాద్ సభలో హోరెత్తిన జై శ్రీరామ్ నినాదాలు