Akunuri Murali: బుద్ది ఉందా? తెలంగాణ పోలీసులపై ఆకునూరి మురళి ఆగ్రహం
Telangana Police: తెలంగాణను థర్డ్ డిగ్రీ ఫ్రీ స్టేట్ గా మార్చాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana News: తెలంగాణకు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి రాష్ట్ర పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రదర్శించిన తీరు సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై ఆకునూరి మురళి స్పందించారు. ఇప్పుడు కూడా థర్డ్ డిగ్రీలు ఏంటండి.. బుద్ధి ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటకు వచ్చినవి కొన్నే.. బయటకు రానివి 10 రెట్లు ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఇప్పుడు కూడా ఈ థర్డ్ డిగ్రీ చిత్రహింసలు ఏంటండీ? బుద్ది ఉందా? బయటకు వచ్చినవి కొన్నే. బయటకు రానివి పది రెట్లు ఉంటాయి. పోలీస్! please stop these attrocities on vulnerable people. మీరు సెలవులు లేకుండా చాలా కష్టపడతారు కానీ ఇలాంటి దుర్మార్గాలతో డిపార్ట్మెంట్ అంత బదనాం అవుతుంది. ప్రభుత్వం ఇలాంటి పోలిసుల మీద కఠినచర్యలు తీసుకోవాలి. డిపార్ట్మెంట్ క్రమశిక్షణ చర్యలతో పాటు చట్టపర చర్యలు తీసుకొని నిందితులను జైలుకి పంపాలి. మరియమ్మ లాక్ అప్ డెత్ లో కూడా చట్టపర చర్యలు తీసుకోకుండా నిందిత పోలీసులను వదిలి పెట్టారు. అన్యాయం. తెలంగాణ డీజీపీ దయచేసి తెలంగాణను థర్డ్ డిగ్రీ చిత్రహింసల రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దండి. ఇంకా ఎన్నాళ్ళు?’’ అని ఆకునూరి మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు కూడా ఈ థర్డ్ డిగ్రీ చిత్రహింసలు ఏంటండీ ? బుద్ది ఉందా?
— Murali Akunuri (@Murali_IASretd) August 6, 2024
బయటకు వచ్చినవి కొన్నే. బయటకు రానివి పది రెట్లు ఉంటాయి. @police ! please stop these attrocities on vulnerable people.
మీరు సెలవులు లేకుండా చాలా కష్టపడతారు కానీ ఇలాంటి దుర్మార్గాలతో డిపార్ట్మెంట్ అంత బదనాం అవుతుంది.… pic.twitter.com/XhPMidJZzc
దళిత మహిళపై థర్డ్ డిగ్రీ
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో చోరీ ఆరోపణలపై అరెస్టు అయిన దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. షాద్‌నగర్‌కు చెందిన భీమయ్య అతని భార్య సునీత, కుమారుడు జగదీశ్ దీంట్లో బాధితులుగా ఉన్నారు. ఈ విషయం బయటికి రావడంతో పోలీసు ఉన్నతాధికారులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మహిళపై దారుణమైన రీతిలో ఇబ్బందులకు గురి చేశారు. షాద్‌నగర్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ రాంరెడ్డి, కానిస్టేబుళ్లు కరుణాకర్, మోహన్‌లాల్, రాజు, జాకీర్, మహిళా కానిస్టేబుల్ అఖిల ఈ థర్డ్ డిగ్రీకి కారకులని గుర్తించి వారిని సస్పెండ్ చేశారు.
మహిళ సునీతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై సీఎం రేవంత్ కూడా సీరియస్ అయ్యారు. దీంతో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, శంషాబాద్ ఏసీపీ రంగస్వామితో విచారణ చేయించి నివేదిక ఆధారంగా పోలీసులను సస్పెండ్ చేశారు. బాధితురాలు సునీతను మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణి, ఆర్ఎస్ ప్రవీణ్ తదితరులు పరామర్శించారు. అనంతరం రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

