అన్వేషించండి

Weather Updates: తెలంగాణలో నేడు దంచికొట్టనున్న వర్షాలు, ఆ 13 జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్

Telangana Rains | తెలంగాణలోని 13 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసిన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల ప్రజలు సాయంత్రం, రాత్రివేళ అప్రమత్తంగా ఉండాలి.

Hyderabad Rains | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మరో రెండు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. భారీ వర్ష సూచనతో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. శనివారం సాయంత్రం నుంచి రాత్రివరకు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలతో పాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచగా.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. ఆగస్టు 13 నాటికి వాయువ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నాడు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసి ఈ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. 

హైదరాబాద్ వాసులకు అలర్ట్..
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. కానీ ఆ తరువాత నుంచి రాత్రి వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఆ సమయంలో అత్యవసరం అయితేనే ఇండ్ల నుంచి బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో వరద నీటితో ప్రజలు ఇబ్బంది పడ్డారు. పలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే కొన్ని ప్రాంతాల ప్రజలు భయపడేలా నగరంలో వర్షాలు కురుస్తున్నాయి.

 

 

ప్రస్తుతం, కామారెడ్డి, సిరిసిల్లలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే 2 గంటల పాటు తీవ్ర వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపిన వివరాల ప్రకారం.. నేడు, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్, నారాయణపేట, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట వంటి దక్షిణ, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన  భారీ వర్షాలు కురుస్తాయి.

ఆగస్టు నెలలో మూడోసారి
క్లౌడ్ బరస్ట్ కావడంతో హైదరాబాద్ లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఆగస్టు నెలలో ఇది మూడోసారి. శనివారం సాయంత్రం నుంచి రాత్రి కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో 100 మి.మీ కంటే అధిక వర్షపాతం నమోదైంది.  
బేగంబజార్: 117.5 మి.మీ
చార్మినార్: 106.3 మి.మీ
ఖైరతాబాద్ CESS: 94.3 మి.మీ
నాంపల్లి: 92 మి.మీ
ఆసిఫ్ నగర్r: 91.8 మి.మీ
హయత్ నగర్: 90.5 మి.మీ

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Embed widget