అన్వేషించండి

MIPCOM Cannes Telangana: కాన్స్ వేదికగా తెలంగాణ హవా - డిసెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో ఇండియాజాయ్ 9వ ఎడిషన్!

IndiaJoy 2026 Hyderabad: మిప్‌కామ్ కాన్స్‌లో అంతర్జాతీయ మీడియా దిగ్గజాలతో తెలంగాణ ప్రతినిధి బృందం భేటీ అయింది. డిసెంబర్‌లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఇండియాజాయ్ 2026 జరగనుంది.

IMAGE Towers Hyderabad AVGC:  ఫ్రాన్స్‌లోని కేన్స్ నగరం వేదికగా జరుగుతున్న ప్రపంచ ప్రసిద్ధ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ మార్కెట్  మిప్‌కామ్ కాన్స్ 2026  (MIPCOM Cannes 2026)లో తెలంగాణ ప్రభుత్వం తన పెట్టుబడుల  ప్రచారాన్ని హోరెత్తించింది. అంతర్జాతీయ వినోద రంగ దిగ్గజాలతో తెలంగాణ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ప్రత్యేకంగా భేటీ అయి, రాష్ట్రంలో స్టూడియో పెట్టుబడులు, సంయుక్త నిర్మణాలు,  అంతర్జాతీయ భాగస్వామ్యాలపై విస్తృత చర్చలు జరిపింది. ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవో బి. అజిత్ రెడ్డి నేతృత్వంలో ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి  , ఏవిజిసి డైరెక్టర్ వల్లభి ఎ., కన్సల్టెంట్ స్వభావ్ శెట్టిలతో కూడిన బృందం ఇండియా పెవిలియన్‌లో ప్రత్యేక తెలంగాణ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని చలనచిత్ర పరిశ్రమ, సాంకేతిక సామర్థ్యం, మానవ వనరులు , ప్రతిష్టాత్మక ఇమేజ్ టవర్స్ ప్రాజెక్ట్‌ను గ్లోబల్ దిగ్గజాలకు వివరించారు.

దిగ్గజ సినీ నిర్మాణ సంస్థలతో చర్చలు

ఈ అంతర్జాతీయ సదస్సులో సోనీ, డ్రీమ్‌వర్క్స్ యానిమేషన్, అమెజాన్ ఎమ్జీఎమ్ స్టూడియోస్‌లతో పాటు కొలంబియాకు చెందిన కార్యాకోల్ టెలివిజన్, బ్రెజిల్ గ్లోబో , స్పెయిన్  ఆర్‌టీవీఈ , లాటిన్ మీడియా కార్ప్, టీజీ ఎంటర్‌టైన్‌మెంట్, అరబ్ మీడియా టీవీ ప్రొడక్షన్ వంటి ప్రపంచవ్యాప్త మీడియా సంస్థలతో తెలంగాణ బృందం సమగ్రంగా చర్చించింది. స్టూడియో నిర్వహణ, యానిమేషన్, విఎఫ్ఎక్స్  ప్రొడక్షన్, ఒరిజినల్ కంటెంట్ డెవలప్‌మెంట్, ఫార్మాట్ అడాప్టేషన్, డబ్బింగ్-లోకలైజేషన్ రంగాల్లో తెలంగాణలోని సృజనాత్మక సంస్థలకు గ్లోబల్ మార్కెట్ అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి. దీనికి తోడు దక్షిణ కొరియా  , మలేషియా  , ఫిలిప్పీన్స్ ఫిల్మ్ అకాడమీలతో దేశాల మధ్య నైపుణ్యాల మార్పిడికి భాగస్వామ్యాలు కుదుర్చుకుంది.

ఫ్యూచర్ సిటీలో ఇండియా జాయ్ 9వ ఎడిషన్

ఈ మిప్‌కామ్ కాన్స్ వేదికపైనే తెలంగాణ విఎఫ్ఎక్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మక  ఇండియాజాయ్  9వ ఎడిషన్ షెడ్యూల్‌ను ప్రతినిధి బృందం అధికారికంగా ప్రకటించింది. టీవాగా ప్రెసిడెంట్, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సీఈఓ రాజీవ్ చిలక, టీవాగా జనరల్ సెక్రటరీ మైక్ యాతంలతో కలిసి ఈ ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ  ఇండియాజాయ్ 2026  ఈవెంట్.. డిసెంబర్ 7 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని  భారత్ ఫ్యూచర్ సిటీ  వేదికగా,  ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్ లో భాగంగా జరగనుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రతిపాదించిన  స్టోరీస్, గేమ్స్, డ్రీమ్స్  అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు అలరించనున్నాయి.

2018లో ప్రారంభమైన ఇండియాజాయ్.. ఫిల్మ్, యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, ఈ-స్పోర్ట్స్, కామిక్స్, ఓటీటీ, ఏఐ సాంకేతికతలకు ఆసియాలోనే అతిపెద్ద కన్వర్జెన్స్ వేదికగా నిలిచింది. ఈ 9వ ఎడిషన్‌లో భాగంగా హైదరాబాద్ కామిక్ కాన్, డ్రీమ్‌హాక్ ఇండియా, విఎఫ్ఎక్స్ సమిట్, దేశీటూన్స్, ఓటీటీ పల్స్, ఇండియన్ ఫిల్మ్ కాంక్లేవ్ ,  ఇండియాజాయ్ ఏఐ కాంక్లేవ్ వంటి 11 ప్రధాన ఈవెంట్లు జరగనున్నాయి. ఇక్కడ యానిమేషన్-ఫిల్మ్ కంటెంట్ మార్కెట్లు, ఇన్వెస్టర్ కనెక్ట్ ప్రోగ్రామ్‌లు, ప్రొడక్ట్ లాంచ్‌లు మరియు బిజినెస్-టు-బిజినెస్   సమావేశాలు నిర్వహించి, లోకల్ క్రియేటర్లను గ్లోబల్ కొనుగోలుదారులు , ఇన్వెస్టర్లతో అనుసంధానించనున్నారు.

మిప్‌కామ్ కాన్స్ ద్వారా తెలంగాణ ఏవిజిసి  రంగానికి ఉన్న విదేశీ ఆకాంక్షలను ప్రపంచ మీడియా దిగ్గజాల ముందు నేరుగా ప్రదర్శించగలిగామని ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవో బి. అజిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేన్స్‌లో ప్రారంభమైన ఈ సుదీర్ఘ చర్చలను రాబోయే డిసెంబర్ 7-9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్'లో పూర్తిస్థాయి పెట్టుబడులుగా, అంతర్జాతీయ ఒప్పందాలుగా మలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా సంస్థలను, అంతర్జాతీయ ప్రతినిధులను డిసెంబర్‌లో హైదరాబాద్‌కు రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలంగాణ బృందం ఆహ్వానించింది.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Telangana Education Reforms: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
CM Revanth Reddy: నరేంద్ర మోదీ విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్, దేశాన్ని అప్పుల్లోకి నెట్టాడు: ABP సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
నరేంద్ర మోదీ విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్, దేశాన్ని అప్పుల్లోకి నెట్టాడు: ABP సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit 2026 LIVE: ప్రధాని మోదీ పాక్ వెళ్లి బిర్యానీ తినొచ్చారు: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీ పాక్ వెళ్లి బిర్యానీ తినొచ్చారు: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
Embed widget