By: ABP Desam | Updated at : 30 Nov 2021 05:31 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి కేటీఆర్(ఫైల్ ఫొటో)
మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ కొత్త సీఈవోగా భారత సంతతి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో జాక్ డోర్సే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించారు. ప్రపంచ టాప్ టెక్ కంపెనీలను ముందుకు నడిపించే భారతీయుల జాబితాలో పరాగ్ అగర్వాల్ కూడా చేరారు. అంతర్జాతీయ టెక్ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, ఐబీఎం, ట్విటర్, మైక్రాన్, మాస్టర్ కార్డ్ సంస్థలను భారత సంతతికి చెందిన వాళ్లు లీడ్ చేస్తున్నారు.
What do MicroSoft, Google, Adobe, IBM, Micron, Master Card and now Twitter have in common?
All are led by CEOs who grew up in India!
Congratulations to @paraga who’s been chosen as the CEO of Twitter— KTR (@KTRTRS) November 30, 2021
పరాగ్ అగర్వాల్ కు కేటీఆర్ శుభాకాంక్షలు
టాప్ కంపెనీలను లీడ్ చేస్తున్న భారతీయులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, ఐబీఎం, ట్విటర్, మైక్రాన్, మాస్టర్ కార్డ్ సంస్థల్లో ఓ కామన్ పాయింట్ ఉందని ట్వీట్ చేశారు. భారత్‌లో ఉన్నత చదువులు చదివిన వ్యక్తులే ఇప్పుడు ఈ కంపెనీ సీఈవోలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. భారతీయులకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు రావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ట్విట్టర్ కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పరాగ్ అగర్వాల్ కు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: రూ.17 వేలలోనే రెడ్‌మీ సూపర్ 5జీ ఫోన్.. త్వరలో మార్కెట్లోకి!
భారతీయ సీఈవోలు
మైక్రోసాఫ్ట్ సీఈవోగా హైదరాబాద్‌కు చెందిన సత్య నాదెళ్ల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గూగుల్ సీఈవోగా తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓగా హైదరాబాద్‌కి చెందిన శంతను నారాయణ్, ఐబీఎం సీఈవోగా ఏపీకి చెందిన అరవింద్ కృష్ణ సేవలు అందిస్తున్నారు. మైక్రాన్ టెక్నాలజీ సీఈవోగా కాన్పూర్‌కి చెందిన సంజయ్ మెహ్రోత్రా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పుణెకి చెందిన అజయ్ బంగా మాస్టర్ కార్డ్ భారత్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు.
Also Read: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?
ఎలన్ మస్క్ ట్వీట్
ట్విట్టర్ సంస్థ సీఈవోగా భారతీయ అమెరికన్ పరాగ్ అగర్వాల్ నియామకంపై టెస్లా సీఈవో ఎలన్ మస్క్ స్పందించారు. ప్రతిభావంతులైన భారతీయుల వల్ల అమెరికా లబ్ధి పొందుతున్నట్లు మస్క్ ట్వీట్ చేశారు.
Also Read: ట్విట్టర్ సీఈవోగా మనోడు.. టెక్ కంపెనీల్లో కొనసాగుతున్న భారతీయుల హవా
KCR Political strategy : గవర్నర్తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?
TSWRES Inter Admissions: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?
TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు
Republic Day Celebrations 2023: రిపబ్లిక్ డే పరేడ్ లో సత్తా చాటిన ఏపీ, తెలంగాణ ఎన్సీసీ క్యాడెట్స్ - ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ ట్రోఫీ
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్