అన్వేషించండి

కేటీఆర్‌కు కరోనా - ఇంట్లోనే ఐసోలేషన్ !

తెలంగాణ మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. లక్షణాలు పెరుగుతున్నందున ఇంట్లోనే ఐసోలేట్ అవుతున్నట్లుగా ప్రకటించారు.

Telangana Minister KTR is infected with Corona :  తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒంట్లో నలతగా ఉండటం.. స్వల్ప లక్షణాలు కనిపిస్తూండటంతో ఆయన టెస్ట్ చేయించుకున్నారు. రిపోర్టుల్లో పాజిటివ్ అని రావడంతో ఇంట్లోనే ఐసోలేట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని కేటీఆర్ కోరారు. 

కేటీఆర్‌కు రెండో సారి కరోనా పాజిటివ్ 

కేటీఆర్‌కు కరోనా సోకడం ఇది రెండో సారి. గత ఏడాది కూడా ఆయన కరోనా బారిన పడ్డారు. అప్పట్లో కొన్ని శ్వాస కోశ సమస్యలు కూడా తలెత్తాయని కేటీఆర్ కొన్ని సందర్భాల్లో చెప్పారు. అయితే రెండు రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత తగ్గిపోయాయన్నారు. ఇప్పుడు కూడా స్వల్ప కరోనా లక్షణాలే ఉన్నందున ఇంట్లోనే ఐసోలేట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. కేటీఆర్ ప్రికాషన్ డోస్ కూడా తీసుకున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో కరోనా .. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి కూడా వస్తోంది. అయితే స్వల్ప లక్షణాలతో తగ్గిపోతోంది. కొంత మందికి సోకినా లక్షణాలు బయటపడటం లేదు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని సార్లు తగ్గుతున్నాయి. చాలా మంది కరోనా లక్షణాలు కనిపిస్తేనే టెస్టులు చేయించుకుని ఐసోలేట్ అవుతున్నారు. 

కాలు ఫ్రాక్చర్‌ నుంచి ఇటీవలే  కోలుకున్న కేటీఆర్ 

కేటీఆర్ ఇటీవలే ఇంట్లో ప్రమాదానికి గురయ్యారు. కాలు ఫ్రాక్చర్ అయింది. దీంతో మూడు వారాల పాటు బెడ్ రెస్ట్‌కే పరిమితమయ్యారు. ఇటీవలే ఆయన  కోలుకుని స్వల్పంగా నడవగలుగుతున్నారు. మళ్లీ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా రావడంతో మరికొద్ది రోజులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే గతంలోలా ఇప్పుడు కరోనాకు రెండు వారాల పాటు ఐసోలేషన్‌లోఉండటం లేదు. నాలుగైదు రోజుల తర్వాత టెస్టులు చేయించుకుని మళ్లీ విధుల్లోకి వెళ్తున్నారు. 

త్వరగా కోలుకోవాలని అభిమానుల సందేశాలు

కరోనా సోకిన విషయం గురించి కేటీఆర్ సోషల్ మీడియాలో చెప్పడంతో చాలా మంది అభిమానులు త్వరలో కోలుకోవాలని అభిలాషిస్తున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
Organ Transplant Green Channel: ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
Tank Bund Shiva:ట్యాంక్‌బండ్‌లో దూకేవాళ్ల కథలన్నీ అలాంటివే! ట్యాంక్ బండ్ శివతో ABPదేశం ఇంట్రాక్షన్
ట్యాంక్‌బండ్‌లో దూకేవాళ్ల కథలన్నీ అలాంటివే! ట్యాంక్ బండ్ శివతో ABPదేశం ఇంట్రాక్షన్
Huzurabad Politics: హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ వివాదం.. పోరాటానికి సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ వివాదం.. పోరాటానికి సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Car Maintenance Guide: తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
Organ Transplant Green Channel: ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
Car SafetyTips in Summer : ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
Embed widget