Telangana Medical Seats: కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే!
Telangana Medical Seats: తెలంగాణ వచ్చిన తర్వాత నిర్మించిన మెడికల్ కాలేజీల్లో 85 శాతం కన్వీనర్ కోటా సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.
Telangana Medical Seats: రాష్ట్రంలో 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. మొత్తం 34 వైద్య కళాశాల్లలోని సీట్లలో 85 శాతం కన్వీనర్ కోటా సీట్లు రాష్ట్ర విద్యార్థులకే వర్తిస్తాయని హైకోర్టు సోమవారం రోజు స్పష్టం చేసింది. అఖిల భారత కోటా 15 శాతంలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పాటు అయిన కళాశాలల్లో సీట్లన్ని తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జులై 3వ తేదీన తీసుకొచ్చిన జీవో 72ను సమర్థించింది. మరోవైపు ఈ జీవో 72ను సవాల్ చేస్తూ.. ఏపీ విద్యార్థులు 60కి పైగా పిటిషన్లు దాఖలు చేశారు.
అయితే పిటిషన్లను కొట్టివేస్తూ.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. అలాగే వైద్య ప్రవేశాలకు సంబంధించిన 2017 నిబంధనలను సవరించే అధికారం.. తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. అయితే ఈ నిబంధనలను కేవలం పార్లమెంట్ మాత్రమే సవరించాలని.. శాసన సభకు అధికారం ఉండదని చెప్పడం కేవలం అపోహ మాత్రమేనని తెలిపింది. ఇక సవరించిన నిబంధనల ప్రకారం చూసుకుంటే 85 శాతం కాంపిటెంట్ అథారిటీ సీట్లను స్థానికులకు వర్తింపజేయడం రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 5, 6 పేరాల ప్రకారం విరుద్ధమే కాదని పేర్కొంది. అలాగే రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం ఏపీ, తెలంగాణల్లో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, మెడికల విద్యా కోర్సుల్లో కోటా ప్రకారమేనని తెలిపింది. కానీ 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు అయిన విద్యా సంస్థలకు ఈ సెక్షన్ వర్తించదని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశాల నిబంధనలను సవరించినటువంటి నేపథ్యంలో సెక్షన్ 95 కింద ఏపీ విద్యార్థులు ఎలాంటి చట్టపరమైన హక్కును పొందలేరని చెప్పింది. చట్టాలకు విరుద్ధంగా చట్టబద్ధమైన హక్కులను పొందాలనుకోరాదని చెప్పింది. ఇక మార్చి 6వ తేదీన నీట్ నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత జూన్ 3వ తేదీన నిబంధనలకు సవరణ తీసుకు వస్తూ.. ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే దీన్ని పిటిషనర్లు పూర్తి తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పింది. ఇక మెడికల్ అడ్మిషన్ల నిమిత్తం కాళోజీ వర్సిటీ జూన్ 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిందని.. అంటే అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కాకముందే నిబంధనల సవరణ జరిగిందని స్పష్టం చేసింది. 100 శాతం రిజర్వేషన్ చెల్లదంటూ గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు వాస్తవానికి ఉద్యోగాలకు సంబంధించిందని.. విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు వర్తించదని పేర్కొంది. అలాగే మెడికల్ అడ్మిషన్లలో కూడా వంద శాతం రిజర్వేషన్లు లేవని.. 15 శాతంలో ఆలిండియా కోటాలో ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడొచ్చని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇది శుభ పరిణామం అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ తీర్పు ఇవ్వడం శుభ పరిణామం. తెలంగాణ విద్యార్థులకు శుభాకాంక్షలు.
— Harish Rao Thanneeru (@BRSHarish) September 11, 2023
జిల్లాకో…