Governor Tamilisai : బీజేపీ కార్యకర్త ఆత్మహత్యపై నివేదిక కోరిన గవర్నర్ తమిళి సై, మెడికల్ సీట్ల దందాపై సీరియస్
Governor Tamilisai : మెడికల్ పీజీ సీట్ల దందాపై గవర్నర్ తమిళి సై సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై తనకు పూర్తి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఆత్మహత్య, అత్యాచారాలపై ప్రభుత్వాన్ని నివేదిక కోరారు.
Governor Tamilisai : తెలంగాణలో మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందా ఆరోపణలపై గవర్నర్ తమిళిసై స్పందించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన వారికి సీట్లు రాకపోవడం ఆందోళనగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. తానూ స్వయంగా డాక్టర్ అని అన్నారు. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ అధికారులకు సూచించారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లను అమ్ముకుంటున్నారని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. మొత్తం 45 అనుమానాస్పద దరఖాస్తులను అధికారులు గుర్తించారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 33 మెడికల్ కాలేజీలు ఉన్నాయి.
పీజీ మెడికల్ సీట్లు బ్లాక్
రాష్ట్రంలో మొత్తం 9 గవర్నమెంట్, 20 ప్రైవేట్, 4 మైనారిటీ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో 2,300 పీజీ సీట్లు ఉండగా యాజమాన్య కోటాలో 390 సీట్లు ఉన్నాయి. నార్త్ ఇండియా నుంచి 45 మంది విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యూయేట్ చేసేందుకు అప్లై చేసుకున్నారు. వారికి వివిధ మెడికల్ కాలేజీల్లో సీట్లు కేటాయించారు. ఇతర రాష్ట్రాల్లో మెరిట్ జాబితాలో ఉన్న విద్యార్థులు తెలంగాణలో పీజీ చేస్తామని సీట్ బ్లాక్ చేశారు. దీంతో లోకల్ మెరిట్ విద్యార్థులకు పీజీ చేసే అవకాశం లేకుండా పోయింది. ప్రైవేట్ వైద్య కళాశాలలపై అనుమానం వచ్చిన రిజిస్ట్రార్ ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పీజీ సీట్ బ్లాక్ చేస్తే చర్యలు తీసుకుంటామని లేఖలు రాశారు. దీంతో వాళ్లంతా పీజీ సీట్ కోసం అప్లై చేసుకోలేదని తెలిపారు. ఈ పీజీ సీట్ల బ్లాక్ దందాపై రిజిస్ట్రార్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Also Read : Revant Reddy GO 111 : 111 జీవో రద్దు చెల్లదా ? 2007లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలేంటి ?
బీజేపీ కార్యకర్త ఆత్మహత్యపై నివేదిక
ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సామినేని సాయి గణేష్ ఆత్మహత్య, కామారెడ్డి జిల్లాలో తల్లీకొడుకుల ఆత్మహత్యలు, ఇత అంశాలపై బీజేపీ రాష్ట్ర విభాగం సమర్పించిన వివిధ మీడియా, సోషల్ మీడియా నివేదికలు, రిపోర్టులను గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పరిశీలించారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో జరిగిన పరువు హత్యలు, సామూహిక అత్యాచారం వంటి దారుణమైన నేరాలపై
ప్రభుత్వం నుంచి నివేదిక కోరారు.
Also Read : Hyderabad Rains : హైదరాబాద్ లో చల్లబడిన వాతావరణం, సాయంత్రం నుంచి ఈదురుగాలులతో వర్షం