అన్వేషించండి

Telangana financial difficulties: పథకాల ఒత్తిడి, అప్పుల రీపేమెంట్లు - పెరగని ఆదాయం - ఆర్థిక సుడిగుండంలో తెలంగాణ ప్రభుత్వం!

Telangana: తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుంది. ఖర్చులు భారీగా ఉంటే.. ఆదాయం మాత్రం దానికి తగ్గట్లుగా పెరగడం లేదు. భూముల అమ్మకాలపై ఆధారపడుతున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • CAG నివేదిక: తెలంగాణ ఆర్థిక లోటు గణనీయంగా పెరుగుతోంది.
  • ఆదాయం అంచనాల కంటే తక్కువ, ఖర్చులు, అప్పులు పెరిగాయి.
  • రోజువారీ ఖర్చుల కోసం ప్రభుత్వం అప్పులపై ఆధారపడుతోంది.
  • ఆర్థిక వృద్ధికి భూముల అమ్మకాలపై ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది.

Telangana government is struggling with financial problems: తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా ఎదుర్కొంటున్న సవాళ్లు మరింత తీవ్రమవుతున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్  తాజా రిపోర్ట్ హెచ్చరిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో  ఏప్రిల్-సెప్టెంబర్ వరకు ఫిస్కల్ డెఫిసిట్ రు.45,139 కోట్లకు చేరింది.  ఏడాది మొత్తం మీద ఈ లోటు  రూ.54,010 కోట్లు మాత్రమే ఉంటుందని అనుకున్నారు. కానీ ఆరు నెలల్లోనే  83.58 శాతం  లోటు నమోదు అయింది. రెవెన్యూ డెఫిసిట్ రూ.12,453 కోట్లకు పెరిగింది, రెవెన్యూ కలెక్షన్లు అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి.  

అంచనాలను అందని ఆదాయం - పెరిగిపోతున్న లోటు 
 
 కాగ్ రిపోర్ట్ ప్రకారం, మొదటి ఆరు నెలల్లో మొత్తం రెవెన్యూ రసీదులు రూ.1.22 లక్షల కోట్లు వచ్చాయి, ఇది వార్షిక అంచనా ₹2.85 లక్షల కోట్లలో 42.87 శాతం మాత్రమే. వ్యయాలు రూ.89,394 కోట్లకు చేరాయి, ఇందులో జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలపై ఖర్చు పెరుగుతోంది. జీతాలు రూ. 23,954 కోట్లు, సబ్సిడీలు రూ. 8,124 కోట్లు  ఉంది.  అప్పులు రూ.45,139 కోట్లకు చేరాయి, ఇది వార్షిక టార్గెట్‌ అంచనాలో 84 శాతం. డెట్ సర్వీసింగ్ ఖర్చు రూ.14,371 కోట్లకు పెరిగింది. GST కలెక్షన్లు రూ.25,411 కోట్లు  అంచనా 42.56 శాతం ఉండగా, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ కలెక్షన్లు తగ్గాయి. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్  రూ. 22,209 కోట్లు మాత్రమే, ఇది ఆర్థిక వృద్ధికి అడ్డంకిగా మారింది.

రోజువారీ ఖర్చులకూ అప్పులపైనే ఆధారం 

ప్రభుత్వం ఆదాయంపై కాకుండా అప్పులపై ఎక్కువగా ఆధారపడుతోందని అర్థం చేసుకోవచ్చు.   ఫిస్కల్ డెఫిసిట్ వేగంగా పెరగడం వల్ల రాష్ట్రం FRBM యాక్ట్   పరిధులను దాటిపోయే ప్రమాదంలో పడింది.   రెవెన్యూ డెఫిసిట్ పెరగడం రోజువారీ ఖర్చులు  కూడా  అప్పులతోనే గడవాల్సిన పరిస్థితిని సూచిస్తోంది.   జీడీపీలో  పెరుగుదల తక్కువ  వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగించింది.   అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందిని ఇతర పార్టీలు నిందిస్తున్నాయి. రెవెన్యూ కలెక్షన్లు అంచనాల కంటే తక్కువగా ఉండటం, ఫిస్కల్ డెఫిసిట్ వేగంగా పెరగడం పాలనా అసమర్థతగా విమర్శలు వస్తున్నాయి. 

భూముల అమ్మకాలపై ఆశలు - వేగంగా వేలం ప్రక్రియ 

అప్పులు కూడా సరిపోక పోతూడటంతో తెలంగాణ ప్రభుత్వం భూముల అమ్మకాలపైఆశలు పెట్టుకుంది.  తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భూముల అమ్మకాలు, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల ద్వారా  రూ.25,000 కోట్లు  ఆదాయం పొందాలని ప్రయత్నిస్తోంది.   హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూముల వేలాల ద్వారా  వేల కోట్లు సంపాదించే ప్లాన్  చేసుకుంటోంది.  కొకపేట్, మూసాపేట్ ప్రీమియం ప్రాంతాల్లో 44 ఎకరాల భూములు ఈ-ఆక్షన్‌కు ఉంచారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జరిగే ఈ వేలాల్లో  కనీస ధర ఎకరానికి  రూ.70-99 కోట్లు నిర్ణయించారు. ఇప్పటికే రాయదుర్గంలో ఎకరాకు 170 కోట్లకు చొప్పునవిక్రయించారు. 

గత ప్రభుత్వ అప్పుల వల్ల  తిప్పలని చెప్పి తప్పించుకోలేరుగా  !

గత ప్రభుత్వం అప్పులు చేసిందని అందుకే తాము భూములు అమ్మి ప్రభుత్వాన్ని  నడపాల్సి వస్తోందని  ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదే పదే ఇదే విషయాన్ని చెబుతూ ఉంటారు. కానీ ప్రభుత్వం అన్నాక అన్ని బాధ్యతలు తీసుకుని సమర్థంగా నడపాల్సిందే. గత పాలకులు తప్పు చేశారని..తాము ఏమీ చేయలేమని అంటే అది వైఫల్యం అవుతుంది.  ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచడం.. ద్వారా ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Praja Balam : సంక్రాంతి తర్వాత ప్రజాబలం - రేవంత్ రెడ్డి పల్లెబాట.. కాళేశ్వరంపై కేసీఆర్‌కు చెక్ పెట్టే అసెంబ్లీ స్కెచ్ !
సంక్రాంతి తర్వాత ప్రజాబలం - రేవంత్ రెడ్డి పల్లెబాట.. కాళేశ్వరంపై కేసీఆర్‌కు చెక్ పెట్టే అసెంబ్లీ స్కెచ్ !
KRMB Letter: శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల అసలు అనుమతుల వివరాలివ్వండి.. తెలంగాణ, ఏపీలకు కేఆర్‌ఎంబీ లేఖ
శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల అసలు అనుమతుల వివరాలివ్వండి.. తెలంగాణ, ఏపీలకు కేఆర్‌ఎంబీ లేఖ
Mahesh Kumar Goud: భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Action On MLAs: ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
Pending Municipalities Elections : ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
CII Partnership Summit: ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
Sonia Gandhi Book: మోదీతో సిద్ధాంత పరంగానే పోరాటం.. ఇందిరా గాంధీ కోపం చూసి భయపడ్డా - ఆత్మకథలో సోనియా గాంధీ
మోదీతో సిద్ధాంత పరంగానే పోరాటం.. ఇందిరా గాంధీ కోపం చూసి భయపడ్డా - ఆత్మకథలో సోనియా గాంధీ
Royal Enfield Himalayan 750: 743cc ఇంజిన్, 6-యాక్సిస్ IMU, క్రూయిజ్ కంట్రోల్.. హిమాలయన్ 750 ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750.. యూత్‌ తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు
Ravi Shastri Recall: వరల్డ్ కప్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన పంత్ బ్రేక్.. సౌతాఫ్రికా గుండె పగిలిన వేళ, పోలాక్ కన్నీటి రియాక్షన్
వరల్డ్ కప్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన పంత్ బ్రేక్.. సౌతాఫ్రికా గుండె పగిలిన వేళ, పోలాక్ కన్నీటి రియాక్షన్
Kolkata Sairang Express Derail: పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
Embed widget