అన్వేషించండి

Telangana Elections 2023 : బీసీ నినాదంలో బీజేపీ భారీ ప్రచార కార్యక్రమాలు - మోదీ సభలు ఖరారు !

ప్రధాని మోదీ తెలంగాణలో పాల్గొనే రెండు బహిరంగసభల తేదీలు ఖరారయ్యాయి. బీసీ ఎజెండాతోనే సభలు జరగనున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.


Telangana Elections 2023 : తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని భారీగా నిర్వహించేందుకు  బిజెపి సన్నాహాలు చేస్తోంది. ఇందులోభాగంగా ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా రప్పిస్తోంది. ఈ నెల 7, 11 తేదీల్లో జరిగే బహిరంగ సభలలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. నామినేషన్ల పర్వం ముగిశాక, దశలవారీగా కేంద్ర మంత్రులు కూడా ప్రచారంలో పాలు పంచుకోనున్నారు. విజయం కోసం శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్న బిజెపి  ప్రచారం నిమిత్తం మూడు హెలికాప్టర్లను రప్పిస్తోంది. ఇందులో ఒకటి పూర్తిగా బండి సంజయ్ కు కేటాయించారు. మరో రెండింటిని కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సహా ఇతర ముఖ్య నేతలకు కేటాయించినట్లు తెలుస్తోంది. 

ఏడో తేదీన పరేడ్ గ్రౌండ్‌లో బీసీల ఆత్మగౌరవ సభ                        

ఏడో తేదీన నిర్వహించబోయే సభ బీసీల సభకా నిర్వహించే అవకాశం ఉంది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఈ బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరై ఆ కమ్యూనిటీకి భరోసా ఇచ్చేలా ప్రసంగించబోతున్నట్టు సమాచారం. స్వయంగా బీసీ అయిన ప్రధాని మోడీ ఆ సభలో పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా బీసీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయబోతున్నట్టు రాజకీయవర్గాలు చెబుతున్నాయి.

టీటీడీపీకి మరో బిగ్ షాక్! బీఆర్ఎస్‌లోకి మాజీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్! రేపే కేసీఆర్ సమక్షంలో?

ఇప్పటికే బీసీ సీఎం నినాదం                 

బీజేపీ ఈ ఎన్నికల్లో బీసీ నినాదం తీసుకుంది. రాష్ట్రంలో బీసీలను తన వైపు ఆకర్షించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. బీజేపీ.. బీసీల పార్టీ అనే అభిప్రాయాన్ని తీసుకెళ్లేలా వ్యూహాలు అమలు చేస్తున్నది. బీజేపీ ప్రకటిస్తున్న అభ్యర్థుల జాబితాలో బీసీలకు పెద్ద పీటు వేస్తూ వస్తున్నది. 52 మంది అభ్యర్థులతో విడుదల చేసిన బీజేపీ తొలి జాబితాలో 20 మంది బీసీ నేతలకు టికెట్ ఇచ్చింది. తాజాగా 35 మందితో విడుదల చేసిన మూడో జాబితాలోనూ 13 మంది బీసీ అభ్యర్థులను ప్రకటించింది.                                                    

చచ్చినా ఆ పని చెయ్యనని చెప్పా, కేంద్రం లక్ష కోట్లు కోత పెట్టింది - కేసీఆర్

నామినేషన్లు ముగిసిన తర్వాత మరోసారి మోదీ టూర్              

అలాగే నామినేషన్ల పర్వం ముగిసిన తరువాత ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని భాజపా ఉద్ధృతం చేయనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ప్రచారపర్వంలో పాల్గొననున్నారు. ఈ నెల 19వ తేదీ తరువాత మరోసారి ప్రధాని తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మోదీ, కేంద్ర హోంమంత్రి  అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలంగాణలో పర్యటించారు.                                                                 

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy America Tour Cancelled: తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget