అన్వేషించండి

Telangana Elections 2023 : బీజేపీ మూడో జాబితాలో 35 మంది అభ్యర్థులు - జనసేన సీట్లపై రాని స్పష్టత

బీజేపీ మూడో జాబితాలో 35 మంది అభ్యర్థులు ఉన్నారు. జనసేనకు కేటాయించాల్సిన సీట్లపై క్లారిటీ లేకపోవడంతో గ్రేటర్ లో పలు నియోజకవర్గాల అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.


Telangana Elections 2023 : తెలంగాణ బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో 35 మంది అభ్యర్థులుక చోటు దక్కంది. మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసి రెండో జాబితాలో తన పేరు ఉన్నా కూడా పోటీ చేయనని ప్రకటించిన సినీ నటుడు బాబూమోహన్ పేరుతో ఈ జాబితాలో ఉంది. అయితే జనసేనతో పొత్తు పై స్పష్టత ఉన్నా కేటాయించాల్సిన సీట్లపై తర్జన భర్జన కొనసాగుతూండటంతో.. కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ముఖ్యంగా గ్రేటర్ పరిదిలోని నియోజకవర్గాలను పక్కన పెట్టారు. 
Telangana Elections 2023 : బీజేపీ మూడో జాబితాలో 35 మంది అభ్యర్థులు - జనసేన సీట్లపై రాని స్పష్టత
Telangana Elections 2023 : బీజేపీ మూడో జాబితాలో 35 మంది అభ్యర్థులు - జనసేన సీట్లపై రాని స్పష్టత


కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎప్పుడూ పోటీ చేసే నియోజకవర్గం  అంబర్ పేట నుంచి ఈ సారి ఆయన పోటీ చేయడం లేదు. మాజీ మంత్రి క్రిష్ణాయాదవ్ కు టిక్కెట్ ఇచ్చారు.  ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీ లో  హైదరాబాద్ లో కీలక నేతగా కృష్ణాయాదవ్ ఉండేవారు. మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించేవారు. అయితే తెల్గీ స్టాంపుల కుంభకోణంలో చిక్కుని చాలా కాలం పాటు మహారాష్ట్ర జైల్లో ఉన్నారు . దాంతో ఆయన రాజకీయ జీవితం పూర్తిగా మరిపోయింది. ఆ కేసు నుంచి బయటపడి వచ్చే సరికి.. తెలంగాణ రాజకీయాలు మారిపోయాయి. బీఆర్ఎస్‌లో చేరినా గుర్తింపు లేకపోవడంతో ఇటీవలే  బీజేపీలో చేరారు. వెంటనే ఆయనకు టిక్కెట్ లభించింది. 

మర్రి శశిధర్ రెడ్డి కి సనత్ నగర్ టిక్కెట్  కేటాయించారు. ఈ జాబితాలో పలువురు ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన వారు ఉన్నారు. మాజీ జర్నలిస్టు సంగప్పకు.. నారాయణఖేడ్ నుంచి టిక్కెట్ కేటాయించారు. ఆయన బండి సంజయ్ పిలుపుతో  రాజకీయాల్లోకి వచ్చారు. పలువురు సీనియర్లు పోటీకి వెనుకాడుతూండటంతో..   అభ్యర్థులను ఖరారు చేయడం బీజేపీ పెద్దలకు సమస్యగా మారింది. జనసేన పార్టీ గ్రేటర్ పరిధిలో ఎక్కువ సీట్లను కోరుతోంది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, కూకట్ పల్లి వంటి స్థానాలను కోరుతోంది. అలాంటి చోట్ల.. బీజేపీకి బలమైన నేతలు ఉన్నారు. ఈ సీట్లను జనసేనకు కేటాయిస్తే.. తన దారి తాను చూసుకుంటానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పట్టుబడుతున్నారు. దీంతో జనసేన సీట్లపై క్లారిటీ రాలేదు.                        

గ్రేటర్ తో పాటు..  ఉమ్మడి ఖమ్మంలో  కొన్ని  సీట్లను జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. జనసేన పార్టీతో కన్నా... ఆ పార్టీకి సీట్ల కేటాయింపు వల్ల సొంత పార్టీలోనే ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో  బీజేపీ నేతలు కసరత్తు చేయడానికి ఇబ్బందిపడుతున్నారు. మొదటి జాబితాలో 52, రెండో జాబితాలో ఒక్క పేరు మాత్రమే విడుదల చేశారు. ఇప్పుడు మరో 35 పేర్లను ఖరారు చేశారు. మొత్తంగా 88 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. ఇంకా  31 సీట్లకు పెండింగ్ ఉన్నాయి. వీటిలోనే జనసేనకు సర్దుబాటు చేయాల్సి ఉంది.                   

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget