అన్వేషించండి

Bhatti Vikramarka: సింగరేణికి గుడ్ న్యూస్ - డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తిపై ఒడిశా సీఎం సానుకూల స్పందన

Telangana News: ఒడిశాలోని నైనీ వద్ద సింగరేణి సంస్థ చేపట్టిన బొగ్గు గని ప్రాజెక్టులో తవ్వకాలు చేపట్టేందుకు సహకరించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం ఒడిశా సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు.

Bhatti Vikramarka Meet Odisha CM: తెలంగాణ సింగరేణి సంస్థ ఒడిశాలోని నైనీ వద్ద చేపట్టిన బొగ్గు గని ప్రాజెక్టులో తవ్వకాలు చేపట్టేందుకు సహకరించాలన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విజ్ఞప్తికి ఒడిశా సీఎం (Odisha CM) మోహన్ చరణ్ మాంజీ సానుకూలంగా స్పందించారు. బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. అంతే కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులను ఆదేశించారు. అంగుల్ జిల్లాలోని సింగరేణికి కేటాయించిన నైనీ కోల్ బ్లాక్‌లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని భట్టి విక్రమార్క.. రాష్ట్ర అధికారుల బృందంతో ఒడిశా సీఎంతో ఆ రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, ఇంధన శాఖ ఓఎస్డీ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో ఏం చెప్పారంటే.?

సింగరేణికి నైనీ బొగ్గు బ్లాకుల ఆవశ్యకతను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాంజీకి వివరించారు. 2017లోనే సింగరేణికి నైనీ గనులను కేటాయించారని.. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో నాటి బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని వివరించారు. అప్పుడు అందజేసిన వినతిపత్రాలను అందజేశారు. తాడిచర్ల బ్లాక్, నైనీ బ్లాక్‌లకు సంబంధించిన అడ్డంకులను తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు. 

'రూ.600 కోట్ల వరకూ ఆదాయం'

నైనీ బ్లాక్‌లో తవ్వకాలు చేపట్టడం వల్ల ఒడిశా యువతకు అధిక సంఖ్యలో ఉపాధి, పన్నుల రూపంలో రూ.600 కోట్ల వరకూ ఒడిశా సర్కారుకు ఆదాయం సమకూరుతుందని భట్టి.. ఒడిశా సీఎంకు వివరించారు. నైనీ బ్లాకులో గనుల తవ్వకానికి పారిశ్రామిక, పర్యావరణ అనుమతులు సైతం వచ్చాయని చెప్పారు. అటవీ, ప్రైవేట్ భూములను సింగరేణికి బదలాయించాల్సిన అంశం పెండింగ్‌లో ఉందని.. అది పరిష్కారమైతే సింగరేణి సంస్థ తవ్వకాలు ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో భూముల బదలాయింపు, విద్యుత్, రహదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అక్కడి ఉన్నతాధికారులకు ఒడిశా సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Telangana : వాళ్లందరి దగ్గర రైతుబంధు రికవరీ - ఇవ్వకపోతే కేసులే - రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget