Revanth Reddy On AP Election Results: ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ చూశారా!
Revanth Reddy Wishing Chandrababu and Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. చంద్రబాబు, వవన్ కళ్యాణ్‌లకు విషెస్ తెలిపారు.
Telangana CM Revanth Reddy Responds AP Election Results 2024 | హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ఏ పార్టీ గెలిచినా సాధారణ మెజారిటీ వస్తుందని అంతా భావించగా.. ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు అభినందనలు తెలిపారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్నందున.. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటూ, అభివృద్ధి పథం వైపు సాగుదాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో…
— Revanth Reddy (@revanth_anumula) June 4, 2024
విజయం సాధించిన
టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు గారికి,
జనసేన అధినేత
పవన్ కల్యాణ్ గారికి
నా అభినందనలు.
ఇరు రాష్ట్రాల మధ్య
సత్సంబంధాలను కొనసాగిస్తూ…
సమస్యలను పరిష్కరించుకుంటూ…
అభివృద్ధి పథం వైపు సాగుదాం.@ncbn @PawanKalyan
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషెస్..
ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.