అన్వేషించండి

Revanth Reddy: జూన్ 2 తర్వాత ఆ ఆస్తులు మనకే సొంతం, ఏపీకి సంబంధం లేదు - రేవంత్ రెడ్డి రివ్యూ

Telangana News: ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృత అంశాలపై రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ఈ నెల 18వ తేదీన శనివారం రాష్ట్ర కేబినేట్ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

Revanth Reddy Review Meet: జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలుకొని ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై నివేదిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

బుధవారం (మే 15) మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

షెడ్యూలు 9, షెడ్యూలు 10 లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్తు సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. 

రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి అంశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని, పీటముడి పడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. 

ఇక ఆ భవనాలు తెలంగాణ ఆధీనంలోకి - రేవంత్
పదేండ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. ఈ పదేండ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత రాష్ట్ర అధీనంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

పునర్విభజన చట్ట ప్రకారం పెండింగ్ లో ఉన్న అంశాలు, ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదికను తయారు చేయాలని  
ఆదేశించారు. 

ఈనెల 18న కేబినెట్ భేటీ
ఈ నెల 18వ తేదీన శనివారం రాష్ట్ర కేబినేట్ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీతో పీటముడిగా ఉన్న అంశాలను చర్చించనున్నారు. వీటితో పాటు రైతుల రుణమాఫీ,  ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించనున్నారు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో ముఖ్యమంత్రి ప్రజా పాలనపై దృష్టి కేంద్రీకరించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Telangana Economic situation :తెలంగాణ బడ్జెట్ 2026 - అప్పుల సుడిగుండంలో ఆరు గ్యారంటీల పయనం - రేవంత్, భట్టి జోడి మ్యాజిక్ చేస్తారా?
తెలంగాణ బడ్జెట్ 2026 - అప్పుల సుడిగుండంలో ఆరు గ్యారంటీల పయనం - రేవంత్, భట్టి జోడి మ్యాజిక్ చేస్తారా?

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Embed widget