అన్వేషించండి

Telangana ప్రభుత్వాన్ని పడగొడతారా? ఫాంహౌస్ ఇటుకలు కూడా మిగలవు: రేవంత్ రెడ్డి వార్నింగ్

Telangana News: తమ కూలగొట్టే దమ్ము ఎవరికీ లేదని, ఎవరైనా ప్రయత్నిస్తే ఫాంహౌస్ గోడలే కాదు, ఇటుకలు కూడా మిగలవు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Telangana CM Revanth Reddy comments at Praja Deevena Sabha in Medchal: మేడ్చల్: గత కొన్ని రోజుల నుంచి కొందరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని కూతలు కూస్తున్నారని, కానీ ఎవరైనా తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే, ఫామ్ హౌస్ గోడలే కాదు, ఇటుకలు కూడా మిగలవు అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. మేడ్చల్ లో శనివారం రాత్రి నిర్వహించిన ప్రజా దీవెన సభ (Praja Deevena Sabha)లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో... గత పదేళ్లలో ఈ ప్రాంత అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సమస్యలను వేగంగా పరిష్కరించి.. అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని చెప్పారు.

అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదు.. 
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కూలుతదని కొందరు అంటున్నారు. మేం అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదు. మా ప్రభుత్వాన్ని కూల్చేంత మొనగాడు ఎవడైనా ఉన్నాడా ? ఒకవేళ ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే.. ఫామ్ హౌస్ గోడలే కాదు, ఇటుకలు కూడా మిగలవు అని గుర్తుంచుకోవాలి. రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే మీ కళ్లు మండుతున్నాయా?.

ఆడబిడ్డలకు 43శాతం ఉద్యోగాలు 
ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇస్తలేరని ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతుంది. మేం భర్తీ చేసిన 30వేల ఉద్యోగాల్లో 43శాతం ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చాం. పేర్లతో సహా లెక్కలు చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. చేతనైతే కేసీఆర్ ను అసెంబ్లీకి పంపిస్తే.. లెక్కలు చెబుతాం. ధర్నా చౌక్ వద్దన్న వాళ్లు నేడు సిగ్గులేకుండా వెళ్లి ధర్నా చౌక్ లో ధర్నా చేస్తుండ్రు. తెలంగాణ కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపొతే కేసీఆర్‌ను అడగని వాళ్లు కూడా ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయింది.. హరీష్ రావు మేడిగడ్డకు రమ్మంటే వస్తలేడు. అసెంబ్లీలో మైక్ ఇస్తే మాట్లాడడు. పదేళ్లలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యను కూడా తీర్చలేకపోయారు. మేడ్చల్ ప్రాంతానికి ఐటీ పరిశ్రమలు రావాలి, భూముల విలువ పెరగాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని’ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

ప్రాంతీయ పార్టీలతో పొత్తు ఎందుకు మోదీ?
లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Elections 2024) బీజేపీకి 400 సీట్లు వస్తాయంటున్న ప్రధాని మోదీ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీ పాలనకు ఇక కాలం చెల్లింది. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్నారు. ఎన్డీయేను అతుకుల బొంత అని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతానికి ఎన్నడూ రాని ఈటెల రాజేందర్ ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారు? అని రేవంత్ ప్రశ్నించారు. హుజూరాబాద్ ప్రజలు ఈటలను ఓడిస్తే, మల్కాజ్‌గిరికి వచ్చి గెలుస్తా అని ఎలా అనుకుంటున్నాడో అన్నారు. మేడ్చల్ కు మెట్రో రావాలన్నా, ఐటీ పరిశ్రమలు రావాలన్నా మల్కాజిగిరి పార్లమెంటులో కాంగ్రెస్ గెలవాలని పిలుపునిచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

Kadem Forest Missing Farmer: అడవిలోకి వెళ్లిన గేదెలు వచ్చాయి కానీ పశువుల కాపరి మాత్రం రాలేదు - అడవిలో తప్పిపోయిన వృద్ధ రైతు - డ్రోన్లతో పోలీసుల ముమ్మర గాలింపు!
అడవిలోకి వెళ్లిన గేదెలు వచ్చాయి కానీ పశువుల కాపరి మాత్రం రాలేదు - డ్రోన్లతో కడెం పోలీసుల ముమ్మర గాలింపు!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Breaking News: ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Sri Lanka Death Sentence: శ్రీలంక మాజీ పోలీస్ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీకి మరణశిక్ష - బాంబు దాడులను ఆపలేకపోవడమే కారణం!
శ్రీలంక మాజీ పోలీస్ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీకి మరణశిక్ష - బాంబు దాడులను ఆపలేకపోవడమే కారణం!
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Embed widget