అన్వేషించండి

KTR vs Revanth Reddy: కాంగ్రెస్ 6 గ్యారంటీలు చూసి కేసీఆర్ కు చలి జ్వరం, కేటీఆర్ కి మతి తప్పింది - రేవంత్ రెడ్డి ఫైర్

6 Guarantees of Congress - కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారంటీలు చూసి కేసీఆర్ కు చలి జ్వరం పట్టుకుందని, మంత్రి కేటీఆర్ మతి తప్పి మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

6 Guarantees of Congress in Telangana:

రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారంటీలు చూసి సీఎం కేసీఆర్ కు చలి జ్వరం పట్టుకుందని, ఆయన కొడుకు మంత్రి కేటీఆర్ అయితే మతి తప్పి మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికలకు నిధుల కోసం కర్ణాటకలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ట్యాక్స్ వసూలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, కానీ తాము ఇచ్చిన గ్యారంటీలు చూసి కేసీఆర్ చలి జ్వరం తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి కేటీఆర్ మతి తప్పిన మాటలు మాట్లాడుతున్నారంటూ చురకలు అంటించారు.

బీఆర్ఎస్ పాలన నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించే కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పక్క రాష్ట్రం (కాంగ్రెస్)పై నీ గాలి మాటలను కాసేపు పక్కనబెట్టి, తెలంగాణలో మీ కల్వకుంట్ల SCAMILY గురించి చెప్పు అని కేటీఆర్ కు కౌంటర్ ఇస్తూ రేవంత్ రెడ్డి ట్విట్టర్ (X)లో పోస్ట్ చేశారు. దళిత బంధులో  30 శాతం కమీషన్లు దండుకుంటున్నమని స్వయంగా కేసీఆర్ ఒప్పుకున్న సంగతి గురించి చెప్పు. లిక్కర్ స్కామ్ లో మీ చెల్లి రూ.300 కోట్లు వెనకేసిందని దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు.. భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడుస్తలేదని కాగ్ కడిగేసిన విషయం గురించి చెప్పు అంటూ ఘాటుగా స్పందించారు రేవంత్.

తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నరో. ఎన్నిఎకరాలను మీ రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టిండ్రో. ఎంత మంది మీ బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నరో అన్నారు. ఎన్ని లక్షల చ. అడుగుల స్థలాలు మీ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నయో.. అన్నీ లెక్కలతో సహా తేలుస్తాం. కాంగ్రెస్ దూకుడును అడ్డుకోవడం నీ వల్ల కాదు.. నీ అయ్య వల్ల కూడా కాదు అని రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.

KTR vs Revanth Reddy: కాంగ్రెస్ 6 గ్యారంటీలు చూసి కేసీఆర్ కు చలి జ్వరం, కేటీఆర్ కి మతి తప్పింది - రేవంత్ రెడ్డి ఫైర్

ఇంతకీ కేటీఆర్ ఏమన్నారంటే.. 
కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీకి నిధులు ఇవ్వడానికి "రాజకీయ ఎన్నికల పన్ను" విధించడం ప్రారంభించిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బెంగళూరులో బిల్డర్లకు చదరపు అడుగుకి 500  చొప్పున పన్ను వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. మీ పాత అవాటు ఎన్నటికీ మార్చుకోరు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ తన స్కామ్ ల వారసత్వాన్ని కొనసాగిస్తుందని కనుక ఆ పార్టీని అంతా స్కామ్‌గ్రెస్ అని పిలుస్తారంటూ కాంగ్రెస్ నేతల్ని కవ్విస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నికల కోసం ఎంత డబ్బు ముట్టజెప్పినా తెలంగాణ ప్రజలను ఎవరూ మోసం చేయలేరు.. స్కామ్‌గ్రెస్ కు నో చెప్పాలంటూ కేటీఆర్ పోస్ట్ చేయడంతో వివాదం మొలైంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Embed widget