అన్వేషించండి

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా... ... 7 రోజుల్లో 7 బిల్లులకు ఆమోదం.. వాకౌట్లు, సస్పెన్షన్లు లేకుండా జరిగిన సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ నిరవధికందా వాయిదా పడింది. వర్షకాల అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఏడు రోజుల పాటు సాగిన సమావేశాల్లో 37 గంటల 5 నిమిషాల పాటు చర్చ జరిగింది.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు జరిగాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సభ నిర్వహణపై పూర్తి వివరాలు వెల్లడించారు. అసెంబ్లీలో చర్చలు సజావుగా జరిగాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశంలో సమావేశాలు సజావుగా సాగాయన్నారు. వాకౌట్‌ లేకుండా సభ జరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఐటీ, పురపాలక, మైనారిటీ సంక్షేమం, హరితహారం, పాతబస్తీ ప్రాంత అభివృద్ధి, దళితబంధు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై సభలో సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రి పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఆరోపణలు సరికాదు

వర్షాకాల సమావేశాలు చాలా అర్థవంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా  సజావుగా జరిగాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రోజుకు ఐదు గంటలు పైగా అసెంబ్లీలో చర్చ జరిగిందన్నారు. ప్రజాసమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతిబింబించేలా ఆరు అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందని మంత్రి తెలిపారు. సభాసమయం ఎక్కడా వృధా కాలేదని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో వాకౌట్లు, సస్పెన్షన్లు లేవని మంత్రి తెలిపారు. 101 మంది సభ్యులున్న టీఆర్ఎస్ కు 9.02 గంటలు, తక్కువ మంది సభ్యులున్న ప్రతిపక్షాలకు 11.08 గంటల సభా సమయం కేటాయించారన్నారు. సమయం ఇవ్వలేదని భట్టి విక్రమార్క చెప్పడం సరికాదన్నారు. అధికారపక్షం కంటే విపక్షాలకు ఎక్కువ సమయం ఇచ్చామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలు సరికాదని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. సభలో చర్చించిన ఆరు అంశాల్లో టీఆర్ఎస్ ఇచ్చినవి నాలుగు, మజ్లిస్, కాంగ్రెస్ ఒక్కొ అంశం ఉన్నాయని తెలిపారు.  

Also Read: కాంగ్రెస్‌కు చేత కాలేదు.. మేం చేసి చూపిస్తున్నాం ! అసెంబ్లీలో కేసీఆర్ మార్క్ స్పీచ్ !

ఏడు రోజుల పాటు సమావేశాలు

ఏడు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 37 గంటల 5 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో సభ్యులు 41 ప్రసంగాలు చేశారన్నారు. ఏడు బిల్లులను ఆమోదించడంతో పాటు ఒక తీర్మానం చేశామని ప్రకటించారు. 101 సభ్యులున్న టీఆర్ఎస్ కు 9 గంటల 2 నిమిషాలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి 11 గంటల 8 నిమిషాల సమయం ప్రసగించినట్లు మంత్రి తెలిపారు. ఏఐఎంఐఎం పార్టీకి 5 గంటల 35 నిమిషాలు, కాంగ్రెస్‌ పార్టీకి 3 గంటల 24 నిమిషాలు, బీజేపీకి 2 గంటల 3 నిమిషాల పాటు చర్చలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో 7 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. 

Also Read: కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వరా? అసెంబ్లీలో చర్చ.. కేసీఆర్ స్పష్టత, ఆసక్తికర వ్యాఖ్యలు 


Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా... ... 7 రోజుల్లో 7 బిల్లులకు ఆమోదం.. వాకౌట్లు, సస్పెన్షన్లు లేకుండా జరిగిన సమావేశాలు

" శీతాకాల సమావేశాల్లో మిగిలిన అన్ని అంశాలపై చర్చిస్తాం. కాంగ్రెస్ నేతలు వంతులు పెట్టుకొని సభలో కూర్చొంటున్నారు. తదుపరి సమావేశాలకు కాంగ్రెస్ సభ్యులు పూర్తి స్థాయిలో సన్నద్ధమై రావాలని కోరుతున్నాం. ఎజెండాను ఏ రోజుకు ఆ రోజే పూర్తి చేశాం. సమావేశాలు ముగించే విషయమై నిన్న సభాపతి అన్ని పక్షాల నేతలతో చర్చించారు "
-ప్రశాంత్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ

Also Read: అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేయండి.. తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget