Tammineni veerabhadram: తమ్మినేని ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏఐజీ హాస్పిటల్
Tammineni Veerabhadram Heart Attack: తమ్మినేని వీరభద్రం అస్వస్థతకు లోనయ్యారు. ఖమ్మంలో ఉండగా తమ్మినేని వీరభద్రానికి ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది.
Harish Rao Visits Tammineni Veerabhadram at AIG Hospital: ఖమ్మం: సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అస్వస్థతకు లోనయ్యారు. ఖమ్మంలో ఉండగా తమ్మినేని వీరభద్రానికి ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించేందుకు ఖమ్మం (Khammam)లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు తమ్మినేనికి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ టెస్టుల అనంతరం ఆయనను హైదరాబాద్ తరలించాలని సూచించారు.
ఖమ్మం వైద్యుల సూచన మేరకు తమ్మినేని వీరభద్రాన్ని మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి సీపీఎం నేతకు చికిత్స అందిస్తున్నారు. అయితే తమ్మినేని ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పార్టీ రాష్ట్ర కమిటీ కార్యాలయం తెలిపింది. విశ్రాంతి అవసరమని తమ్మినేనికి వైద్యులు సూచించారని, ఆయనను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు రావొద్దని ఓ ప్రకటనలో సూచించారు.
తమ్మినేనికి మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శ
తమ్మినేనికి గుండెపోటు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతోన్న తమ్మినేని వీరభద్రాన్ని ఆయన పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి తమ్మినేని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కోలుకుని, త్వరలోనే ఆయన ఇంటికి వస్తారని ఆందోళన చెందవద్దంటూ తమ్మినేని కుటుంబ సభ్యులకు హరీష్ రావు ధైర్యం చెప్పారు.
తమ్మినేని ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏఐజీ హాస్పిటల్
ఏఐజీ హాస్పిటల్ తమ్మినేని వీరభద్రం ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తమ్మినేనిని వెంటిలెటర్ సపోర్ట్ తో ఖమ్మం నుంచి ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు. ఆయన గుండె, కిడ్ని, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. తమ్మినేనికి మందులతో చికిత్స అందిస్తున్నాం, రక్తపోటు మెరుగుపడుతుందని తెలిపారు. ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించడానికి ప్రయత్నిస్తున్నాం అని పేర్కొన్నారు. తమ్మినేని వీరభద్రం పరిస్థితి విషమంగానే ఉందని.. డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎన్ కుమార్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నాం అని హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.