అన్వేషించండి

Telangana RTC: తెలంగాణ ప్రజలపై ఆర్టీసీ భారం, చార్జీల పెంపు

Telangana RTC Charges Hike: తెలంగాణలో మరో సారి ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి. హైవేలపై టోల్ చార్జీలు పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వం చార్జీలు పెంచింది. 

Telangana RTC Charges: తెలంగాణలో మరో సారి ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి. హైవేలపై టోల్ చార్జీలు పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ రహదారులపై అన్ని టోల్‌గేట్లలో ఈ రుసుములు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ టికెట్‌ చార్జీల్లో టోల్‌ గేట్‌ రుసుములు పెరిగాయి. టోల్‌ ప్లాజాలు ఉన్న మార్గాల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో రూ.3 చొప్పున చార్జీలు పెరిగాయి. 

పెరిగిన రేట్లు ఇవే
టోల్ గేట్లు ఉన్న రహదారుల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సులు కూడా టోల్‌ రుసుములు చెల్లించాల్సి ఉంది. కేంద్రం నిర్ణయంతో టోల్‌ గేట్‌ చార్జీలు పెరగడంతో ఆర్టీసీ ఆ భారాన్ని ప్రయాణికులపైనే మోపింది. టికెట్‌ చార్జీల్లో కలిసి ఉన్న టోల్‌ రుసుములను రూ.3 చొప్పున పెంచింది. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ.10గా ఉన్న టోల్‌రుసుమును రూ.13కు, డీలక్స్, సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో ఉన్న రూ.13ను రూ.16కు, గరుడ ప్లస్‌ బస్సుల్లో రూ.14 నుంచి రూ.17కు, నాన్‌ ఏసీ స్లీపర్, హైబ్రీడ్‌ స్లీపర్‌ బస్సుల్లో రూ.15 నుంచి రూ.18కి, ఏసీ స్లీపర్‌ బస్సుల్లో రూ.20 నుంచి రూ.23కు పెంచారు.

తప్పనిసరి పరిస్థితుల్లో..
పెరిగిన ఛార్జీలు తాజాగా అమల్లోకి వచ్చాయి. ఒక్కో టోల్ గేట్‌కు రూ. 3 పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా టోల్ ఛార్జీలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 30 లక్షల మంది ప్రయాణిస్తున్నారని.. ఇందులో సిటీలో 12 లక్షల మంది, పల్లె వెలుగు బస్సుల్లో 12 లక్షల మంది జర్నీ చేస్తున్నారని తెలిపారు. వీరికి చార్జీల పెంపు భారం వర్తించదని, మిగతా 6 లక్షల మందికి మాత్రమే అదనపు భారం పడనుందని అధికార వర్గాల సమాచారం. చార్జీలు పెంచినప్పటికీ ఆయా టోల్ గేట్ల వద్ద డబ్బులు చెల్లించిన తర్వాత, ఆర్టీసీకి అదనంగా ఆదాయం వస్తుందని తెలుస్తోంది.

ఓన్లీ ఫర్ జెంట్స్
టోల్ చార్జీలు పెరిగిన నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ అధికారులు సైతం బస్సు ఛార్జీలను పెంచి టిమ్ మిషన్లలో ఆయా మార్పులు చేశారు. అయితే, ఛార్జీల పెంపుపై ఆర్టీసీ ఎలాంటి ప్రకటనా ఇవ్వకపోవడం గమనార్హం. ఛార్జీలు పెంపుపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. దీంతో వారిపై ఎలాంటి భారం పడే అవకాశం లేదు. ఇప్పుడు ఎటొచ్చి ఆ భారాన్ని మోయాల్సిందల్లా పురుషులు మాత్రమే.

టాప్ హెడ్ లైన్స్

Nikitha Godishala Murder Case: అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
Konda Surekha Meet Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన కొండా సురేఖ! సుస్మిత వివాదం తర్వాత తొలిసారి భేటీ !
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన కొండా సురేఖ! సుస్మిత వివాదం తర్వాత తొలిసారి భేటీ !
Konda Surekha Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
Telangana Polytechnic Students Protest: పాలిటెక్నిక్ జీవో 97 రచ్చ - తెలంగాణలో జెన్ జీ ఉద్యమానికి దారితీస్తుందా?
పాలిటెక్నిక్ జీవో 97 రచ్చ - తెలంగాణలో జెన్ జీ ఉద్యమానికి దారితీస్తుందా?

వీడియోలు

Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
IND vs SL 2nd Test | కొలంబో టెస్ట్‌లో శ్రీలంక డ్రా
Dhoni CSK 25% Share Controversy | ధోనీ 25% సీఎస్‌కే వాటా? ఆకాష్ చోప్రా క్లారిటీ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bopparaju Venkateswarlu: ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
Nikitha Godishala Murder Case: అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
NTA New Director: NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
PM Modi Rakhi Celebrations: పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
Petrol, LPG Price Hike:పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరగనున్నాయి! భారీగా పెరిగిన చమురు దిగుమతి ఖర్చు!
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరగనున్నాయి! భారీగా పెరిగిన చమురు దిగుమతి ఖర్చు!
Nepal Earth Quake: నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
Praggnanandhaa Record: ప్రజ్ఞానంద కొత్త చరిత్ర! గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు! 
ప్రజ్ఞానంద కొత్త చరిత్ర! గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు! 
NCLT: ఎన్‌సిఎల్‌టి అంటే ఏమిటి? సుభాష్ చంద్రకు చెందిన రూ. 22,000 కోట్ల అప్పు వివాదాన్ని ఎలా పరిష్కరించింది?
ఎన్‌సిఎల్‌టి అంటే ఏమిటి? సుభాష్ చంద్రకు చెందిన రూ. 22,000 కోట్ల అప్పు వివాదాన్ని ఎలా పరిష్కరించింది?
Embed widget