అన్వేషించండి

Telangana News : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్ - మాల్ స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ

Jeevan Reddy BRS : ఆర్మూరులోని జీవన్ రెడ్డి మాల్ ను ఆర్టీసీ స్వాధీనం చేసుకుంది. అద్దె నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Jeevan Reddy Shopping Mall :  బీఆర్ఎస్ నేత, ఆర్మూర్‌లోని మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మల్టీప్లెక్స్‌ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్‌ నడిబొడ్డున ఆర్టీసీ స్థలంలో ఈ మాల్ ఉంది. ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకుని జీవన్‌రెడ్డి మాల్‌ అండ్‌ మల్టీప్లెక్స్‌  పేరిట భవన నిర్మాణం చేపట్టి సినిమా హాళ్లు, దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సంవత్సరం ప్రాతిపదికన ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె బకాయిలు రూ.7.23 కోట్లకు చేరటంతో సంస్థ అధికారులు లీజుదారు సంస్థకు నోటీసులు ఇస్తూ వచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ప్రభుత్వం మారడంతో బకాయిల కోసం ఆర్టీసీ ఒత్తిడి చేసింది. అయితే జీవన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. 

విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆర్టీసీ స్థలం లీజుకు ! 

చివరికి  హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలను చెల్లించనందున విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని #TSRTC యాజమాన్యం రద్దు చేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్ స్టేషన్ సమీపం లోని ఆర్టీసీ స్థలంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని గురువారం సాయంత్రం సంస్థ స్వాధీనం చేసుకుంది.  ఆర్టీసీకి చెందిన 7059 చదరపు గజాల భూమిని 33 సంవత్సరాలకు విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ కంపెనీ బిల్ట్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌(బీవోటీ) కింద 01.06.2013న లీజ్‌కు తీసుకుంది. 2017లో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సతీమణి రజితా రెడ్డి టేక్‌ఓవర్‌ చేసుకుని.. షాపింగ్‌ మాల్‌కు జీవన్‌ రెడ్డి మాల్‌ అండ్‌ మల్టీపెక్స్‌ గా పేరుపెట్టారు. థర్డ్‌ పార్టీలకు అందులోని స్టాళ్లను లీజ్‌కు ఇచ్చారు. 

ఒప్పందం ప్రకారం అద్దె చెల్లించకుండా ఎగవేత

ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ సకాలంలో అద్దె చెల్లించలేదు. గత ఏడాది అక్టోబర్‌  వరకు రూ.8.65 కోట్ల బకాయి సంస్థకు పడింది. నోటీసులు జారీ చేయడంతో.. అక్టోబర్‌ లో రూ.1.50 కోట్లను ఆ కంపెనీ చెల్లించింది. ఆ తర్వాత షోకాజ్‌ నోటీసులు పంపించడంతో గత ఏడాది డిసెంబర్‌ లో విడతల వారీగా రూ.2.40 కోట్లను కట్టింది. షోకాజ్‌ నోటీసును సవాల్‌ చేస్తూ  హైకోర్టును వారు ఆశ్రయించారు. టీఎస్‌ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో విడతల వారీగా రెండు కోట్లను చెల్లించారు. ఈ కేసుపై బకాయిలన్నీ నెల రోజుల్లో చెల్లించాలని మార్చి 27న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది ప్రజల డబ్బు అని స్పష్టం చేసింది. బకాయిలు చెల్లించకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సంస్థను ఆదేశించింది. నెల రోజుల గడువు పూర్తయిన మొత్తం బకాయిను ఆ కంపెనీ చెల్లించలేదు. ఇప్పటివరకు రూ.2.51 కోట్ల అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.

బకాయిలు చెల్లించాల్సిదేనని తేల్చిన హైకోర్టు 

బకాయిలు చెల్లించాలని గత 5 సంవత్సరాలుగా 20కి పైగా నోటీసులను సంస్థ జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులు, అద్దె ఒప్పంద నిబంధనల ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి.. భవనాన్ని టీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకుంది.   టీఎస్ఆర్టీసీ ప్రజల సంస్థ. అద్దె బకాయిల విషయంలో సంస్థ ఏమాత్రం రాజీ పడటం లేదు. నిబంధనల మేరకే వాటిని వసూలు చేయడం జరుగుతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. 

టాప్ హెడ్ లైన్స్

Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Hyderabad Traffic Diversions: ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget