RGV on Swapnalok Incident: స్వప్నలోక్ ఘటనపై స్పందించిన ఆర్జీవీ,ఆ సినిమా క్లైమాక్స్ అక్కడే షూట్ చేశామంటూ ట్వీట్
RGV on Swapnalok Incident: స్వప్నలోక్ ఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
RGV on Swapnalok Incident:
శివ క్లైమాక్స్ షూట్..
సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతుల కుటుబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఈ క్రమంలోనే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ఘటనపై ట్వీట్ చేశారు. ఇలా జరగడం చాలా బాధాకరమని అన్న ఆయన శివ సినిమా నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. శివ సినిమా క్లైమాక్స్‌ను స్వప్నలోక్ కాంప్లెక్స్ పైనే చిత్రీకరించినట్టు చెప్పారు. నాగార్జున, రఘువరన్ మధ్య వచ్చే ఫైటింగ్ సీన్స్ అక్కడే షూట్ చేసినట్టు ట్వీట్ చేశారు. ఓ నెటిజన్ ఆ సీన్‌కు సంబంధించిన వీడియోని పోస్ట్ చేయగా...RGV ఆ వీడియోని రీట్వీట్ చేశారు.
Very sad to see this ..Incidentally the climax fight of Shiva between @iamnagarjuna and #RaghuVaran has been shot on top of this building https://t.co/DMBek9jnZH
— Ram Gopal Varma (@RGVzoomin) March 17, 2023
This sequence in SHIVA was shot on top of Swapna lok complex which caught fire last nite https://t.co/TcaM5YQWS8
— Ram Gopal Varma (@RGVzoomin) March 17, 2023
తలసాని దిగ్భ్రాంతి..
మృతిచెందిన వారంతా 20-23 మధ్యవయస్కులు కావడం బాధాకరమన్నారు మంత్రి తలసాని. ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని అభిప్రాయపడ్డారు. పొగతో ఊపిరిఆడకనే ఆరుగురు చనిపోయారని తెలిపారు. స్వప్న లోక్ బిల్డింగ్ ఓనర్స్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోడౌన్స్, కమర్షియల్ కాంప్లెక్సులు ఫైర్ సేఫ్టీ మెజర్ మెంట్స్ సరిగా తీసుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే భవిష్యత్తులో నిర్మాణ అనుమతులు రావని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని చెప్పారు మంత్రి తలసాని. కారణమైన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్పెషల్ డ్రైవ్ చేసి ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తామన్నారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాత్రి నుంచి ఆయన అక్కడే ఉండి సహాయక చర్యలు ఎప్పటికప్పుడు పరిశీలించారు.
షార్ట్ సర్క్యూటే కారణం
సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం అని ప్రాథమికంగా భావిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఎప్పుడూ రద్దీగా ఉండే స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో 5, 7 అంతస్తుల్లో ఉన్న దుకాణాలు పూర్తిగా కాలిపోయాయాని తెలిపారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు తమకు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ డీజీ వెల్లడించారు. సమాచారం అందిన తర్వాత హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని భవనం లోపల చిక్కుకుపోయిన 12 మందిని కాపాడామని, కానీ దురదృష్టవశాత్తు అందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు నాగిరెడ్డి తెలిపారు.
Also Read: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష రద్దు, మరో రెండు పరీక్షలను కూడా రద్దు చేసిన టీఎస్పీఎస్సీ!