Revant Reddy : కేసీఆర్ మెడలు వంచింది కాంగ్రెస్సే - పంట వేయని రైతులకు రూ. 15వేల పరిహారం ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి !
కాంగ్రెస్ పోరాటం వల్లనే కేసీఆర్ ధాన్యం కొంటున్నారని రేవంత్ రెడ్డి ప్రకటించారు. పంట వేయని రైతులు.. తక్కువ ధరకే అమ్ముకున్న రైతులకు పరిహారం చెల్లించాలన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) మెడలు వంచి ధాన్యం కొనేలా చేసింది కాంగ్రెస్ పార్టీనేనని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Revant Reddy ) ప్రకటించారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వరి ధాన్యం కొనబోమని.. పంట వేయవద్దని కేసీఆర్ చేసిన ప్రచారం వల్ల పంట వేయక కొందరు, పంట ను తక్కువ ధరకు అమ్ముకుని కొందరు రైతులు నష్టపోయారని వారందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పంట వేయక నష్టపోయిన రైతులకు ఎకరానికి 15వేల నష్ట పరిహారం ఇవ్వాలని .. తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు ఆరు వందల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తల్లీకొడుకుల ఆత్మహత్య - రామాయంపేట మున్సిపల్ చైర్మన్ సహా ఏడుగురిపై కేసు నమోదు, పరారీలో నిందితులు
తెలంగాణలో రాహుల్ గాంధీ ( Rahul Gnadhi ) రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారని రేవంత్ ప్రకటించారు. మే ఆరు, ఏడు తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తారన్నారు. ఆరో తేదీన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారని ప్రకటించారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో 8వేల మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారని రేవంత్ గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక 82 వేల మంది రైతులు చని పోయినట్లు ప్రభుత్వం రైతు భీమా ప్రకటనలు ఇచ్చిందని ప్రకటనలు చూపించారు.
ఆ మంత్రి కారణంగానే బీజేపీ కార్యకర్త సూసైడ్, ఖమ్మంలో హై టెన్షన్!
మిల్లర్లు, ప్రభుత్వం కలిసి రూ. 3 వేల కోట్ల కుంభకోణం చేసి రైతులను నట్టేట ముంచారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన బియ్యం మాయమయ్యాయని.. కేసిఆర్ అధికార ఉన్మాది గా మారి దోచుకుంటున్నారని విమర్శించారు. బియ్యం మాయమైన ఘటన పై సిబిఐ విచారణ జరిపించాలన్నారు. కేసిఆర్ అవినీతిని ఎండ గట్టడానికే రాహుల్ గాంధీ వస్తున్నారని స్పష్టం చేశారు.
నిజామాబాద్ బీజేపీలో వర్గపోరు, ధన్ పాల్ పై చేయి చేసుకున్న ఎండల
తెలంగాణలో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ అధికారం లోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం మంత్రి పువ్వాడ అజయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని రేవంత్ హెచ్చరించారు. ఆయన అరాచకాలు పెట్రేగి పోతన్నాయని.. ఇంట్లో దూరి కొట్టే రోజులు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పెట్టి శునకానందం పొందుతున్నారని.. నిజాంకు పట్టిన గతే కేసిఆర్ కు పడుతుందని మండిపడ్డారు.