CJI NV Ramana : సింగపూర్‌లా హైదరాబాద్‌కు ఖ్యాతి - ఐఏఎంసీకి సీజేఐ ఎన్వీ రమణ భూమిపూజ !
సింగపూర్ మాదిరిగా హైదరాబాద్ కూడా ప్రపంచ ఖ్యాతి పొందాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. ఐఏఎమ్‌సీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఐఏఎమ్‌సీ (IAMC ) భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ( CJI NV Ramana ) శనివారం భూమిపూజ చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం కొనసాగుతోంది. ఆయితే శాశ్వత ప్రాతిపదికన ఇప్పుడు నిర్మిస్తున్నారు. ఎంతో విలువైన భూమిని గచ్చిబౌలిలో తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (KCR ) ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ మధ్య వర్తిత్వ కేంద్రం వల్ల హైదరాబాద్‌కు మరింత పేరుప్రఖ్యాతలు వస్తాయని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.
Chief Justice of #India, #NVRamana on Saturday laid foundation stone for permanent building India's first International Arbitration and Mediation Centre (IAMC). pic.twitter.com/MIUA3q8ecA
— IANS Tweets (@ians_india) March 12, 2022
డ్రగ్స్ కేసులో ఈడీకి ఎందుకు సహకరించట్లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
సింగపూర్ మాదిరిగా హైదరాబాద్ ( HYderabad ) కూడా ప్రపంచ ఖ్యాతి పొందాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ భవన నిర్మాణానికి సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు జడ్జి లావు నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాల్సి ఉంది కానీ, స్వల్ప అనారోగ్యం కారణంగా రాలేకపోయారని, కేసీఆర్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నానని నాగేశ్వరరావు తెలిపారు.
కేసీఆర్‌కి అనారోగ్యమని తెలిసి ఆందోళన పడ్డా, సీఎం క్షేమంగా ఉండాలి: బండి సంజయ్
గచ్చిబౌలి నానక్‌రామ్‌గూడలోని ఫీనిక్స్ వీకే టవర్స్‌లో ఐఏఎంసీని గత డిసెంబర్ పదో తేదీన ప్రారంభించారు. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే శాశ్వత భవనం కోసం వెంటనే భూమి కేటాయించి నిర్మాణాలు ప్రారంభిస్తున్నారు. జూన్ 12న సీజేఐ హోదాలో తొలిసారి హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఐఏఎంసీ ప్రతిపాదన చేసిన వెంటనే సీఎం కేసీఆర్ అంగీకరించారని అప్పట్లో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఆగస్టు 20న ఎంవోయూ, అదే నెల 27న ఐఏఎంసీ ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ జరిగింది. డిసెంబర్ లో ఐఏఎంసీని ప్రారంభించారు. వెంటనే మార్చిలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఐఏఎంసీ ఏర్పాటుకు నిర్మాణం ప్రారంభించేశారు. హైదరాబాద్ ఐఏఎంసీలో వ్యాపార, వాణిజ్యపరమైన వివాదాలే కాకుండా కుటుంబ వివాదాలు కూడా పరిషరించుకొనే వెసులుబాటు ఉంటుంది.