అన్వేషించండి

Richest Districts: తెలంగాణలో రిచ్చెస్ట్ జిల్లాగా రంగారెడ్డి - భాగ్య నగరానికి ఎన్నో స్థానమంటే?

Telangana News: తెలంగాణలో రిచ్చెస్ట్ జిల్లాగా రంగారెడ్డి నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ఓ నివేదిక విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా పర్ క్యాపిటా ఇన్ కం రూ.8.15 లక్షలుగా ఉంది.

Telangana Richest Districts: తెలంగాణలో అత్యంత ధనవంతమైన జిల్లాగా రంగారెడ్డి (RangaReddy) నిలిచింది. హైదరాబాద్ (Hyderabad)ను వెనక్కు నెట్టి మరీ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ మేరకు రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఓ నివేదిక విడుదల చేసింది. 'తెలంగాణ ఎకానమీ 2023' పేరుతో ఈ నివేదికను అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్న జిల్లాగా రంగారెడ్డి నిలిచినట్లు తెలిపారు. పర్ క్యాపిట ఇన్ కమ్ అధారంగా.. రంగారెడ్డి ఈ స్థానం దక్కించుకోగా, హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో సంగారెడ్డి (Sangareddy), మేడ్చల్ మల్కాజిగిరి నాలుగో స్థానం, యాదాద్రి ఐదో స్థానం, ఆరో స్థానంలో నల్గొండ, ఏడో స్థానంలో మహబూబ్ నగర్, మెదక్ జిల్లా ఎనిమిదో స్థానంలో, భద్రాద్రి కొత్తగూడెం తొమ్మిదో స్థానంలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పదో స్థానంలో నిలిచినట్లు అధికారులు వివరించారు. 

అదే కారణమా.?

రంగారెడ్డి జిల్లా పర్ క్యాపిటా ఇన్ కమ్ రూ.8.15 లక్షలకు పైగా ఉండగా.. హైదరాబాద్ పర్ క్యాపిటా ఇన్ కమ్ రూ.4.03 లక్షలకు పైగా ఉంది. అలాగే, హైదరాబాద్ వాసుల కంటే రంగారెడ్డి జిల్లా వాసులో అధికంగా ఆదాయం ఆర్జిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. కాగా, ఐటీ హబ్ కారణంగానే రంగారెడ్డి రిచెస్ట్ జిల్లాగా మారిందని నిపుణులు పేర్కొంటున్నారు. జోన్ల వారీగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని ఐటీ హబ్స్ రంగారెడ్డి జిల్లా వైపు తరలిపోతున్నట్లు చెబుతున్నారు. స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జీడీడీపీ) పరంగా కూడా, తెలంగాణలోని జిల్లాల జాబితాలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. జిల్లా తలసరి ఆదాయం ప్రతి వ్యక్తి జిల్లాలో ఏడాదికి ఆర్జించే సగటు ఆదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ వివరాలు ఓసారి చూస్తే..

పర్ క్యాపిట ఇన్ కమ్ వివరాలు

  • రంగారెడ్డి - రూ.8,15,996
  • హైదరాబాద్ - రూ. 4,03,214 
  • సంగారెడ్డి - రూ. 3,08,166
  • మేడ్చల్-మల్కాజిగిరి - రూ. 2,58,040
  • యాదాద్రి భువనగిరి - రూ. 2,47,184
  • నల్గొండ - రూ. 2,42,103
  • మహబూబ్ నగర్ - రూ. 2,40,900
  • మెదక్ - రూ. 2,32,384
  • భద్రాద్రి కొత్తగూడెం - రూ. 2,28,582
  • జయశంకర్ - రూ. 2,23,481 కోట్లుగా ఉంది.

తలసరి ఆదాయం ఆధారంగా టాప్ 10 ధనిక రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. సిక్కిం మొదటి స్థానంలో ఉండగా.. గోవా రెండో స్థానంలో ఉంది.

Also Read: TS DSC: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌- ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే ప్రకటించే భారీ నోటిఫికేషన్!

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతితో విషాదం
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతితో విషాదం
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
Fake Korrameenu Fish Identification: మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
Nara Lokesh: మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
IND VS SL 2nd Test Day 4 UPdates: సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Embed widget