Telangana Highcourt Congress : "తీర్పు" అడ్డం తిరిగింది - ఉస్మానియాలో రాహుల్ భేటీకి హైకోర్టులోనూ దక్కని పర్మిషన్ !
ఉస్మానియాలో రాహుల్ మీటింగ్‌కు హైకోర్టులోనూ పర్మిషన్ లభించలేదు. కాంగ్రెస్ నేతల పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
Telangana Highcourt Congress : తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఉస్మానియా యూనివర్శిటీలో రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) పర్యటనకు హైకోర్టు పర్మిషన్ వచ్చిందనుకుని సంబరాలు చేసుకున్న ఆ పార్టీ నేతలకు అసలు తీర్పు వచ్చే సరికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. వీసీ అనుమతి ఉంటేనే రాహుల్ సభ నిర్వహించుకోవాలని లేకపోతే లేదని హైకోర్టు స్పష్టం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీ ఉస్మానియాలో సమావేశం పెట్టాలనుకుంటున్నారని.. కానీ వీసీ అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు మూడు రోజుల కిందట హైకోర్టులో పిటిషన్ వేశారు.
బీజేపీ వైపు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చూపు ? బండి సంజయ్‌తో చర్చలు !
ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ( TS High Court ) సింగిల్ బెంచ్.. ఓయూ వైస్ చాన్సలర్‌కు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. కాంగ్రెస్ నేతల దరఖాస్తును పరిశీలించాలని ఓయూ వీసీకి హైకోర్టు సూచించింది. వీసీ నిర్ణయమే ఫైనల్ అని హైకోర్టు చెప్పింది. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు వీసీని కలిసి మరోసారి దరఖాస్తు సమర్పించారు. కానీ వీసీ తన నిర్ణయంలో మార్పేమీ లేదని స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ఓ దశలో పర్మిషన్ ఇచ్చిందని అనుకున్నారు. నూట యాభై మంది విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పినట్లుగా తెలిసింది.
పసుపు బోర్డు తెచ్చే వరకూ ఎక్కడికక్కడ అడ్డుకొనుడే - నిజామాబాద్ ఎంపీపై కవిత ఫైర్ !
అయితే ఆ తర్వాత ఉస్మానియా వైస్ చాన్సలర్ తరపున ఓ అఫిడవిట్‌ను హైకోర్టుకు సమర్పించారు. ఆ అఫిడవిట్‌ను పరిశీలించిన హైకోర్టు వీసీ నిర్ణయమే ఫైనల్ అని తేల్చినట్లుగా తెలుస్తోంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ.. కాంగ్రెస్ నేతల పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. ఉస్మానియాలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు రాజకీయంగా ఆందోళనలు కూడా చేస్తున్నారు. పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా రాహుల్ గాంధఈ ఓయూకు వెళ్తారని చెబుతున్నారు. అయితే హైకోర్టును ఆశ్రయించి... అక్కడ కూడా అనుమతి రాని సందర్భంలో రాహుల్ ఓయూ ( OU ) కు వెళ్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది.