Breaking News Telugu Live Updates: న్యాయరాజధానికి మద్దతుగా భూమన ర్యాలీ
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం..
LIVE

Background
గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
న్యాయరాజధానికి మద్దతుగా భూమన ర్యాలీ
రాయలసీమకు న్యాయ రాజధానిని తీసుకురావాలని మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. శనివారం తిరుపతి నగరంలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారాయన. ఈ కార్యక్రమంలో వేల మంది మహిళలు, యువకులు పాల్గొని మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేశారు.
కృష్ణాపురం ఠాణా నుంచి ఎమ్మెల్యే భూమన కరుణాకర్, ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలో వేల మంది ప్రజలు గాంధీ రోడ్డు తిలక్ రోడ్డు మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభలో ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ.. మూడు రాజధానులకు మద్దతుగా నేడు తిరుపతిలో జరిగిన ఆత్మ గౌరవ మహా ప్రదర్శన పట్ల ప్రజల స్పందన తెలియజేసేందుకు ఇది ఒక రిహార్సల్స్ మాత్రమే అన్నారు. అంచనాలకు మించి ప్రజలు ఇక్కడికి తరలి వచ్చారని పేర్కొన్నారు.
కస్తూర్బా విద్యార్థుల ఫుడ్ పాయిజన్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఫైర్
వరంగల్ : దేవరుప్పుల మండల కేంద్రం కస్తూర్బా పాఠశాలలో రెండు క్రితం భోజనంలో బల్లి పడడంతో స్కూల్ ను సందర్శించి విద్యార్థినిలతో కలిసి స్కూల్ సమస్యలను తెలుసుకున్నరూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మినిస్టర్ వెంట కలెక్టర్ శివ లింగయ్య, అడిషనల్ కలెక్టర్ ఉన్నారు.
ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తుంది
పాఠశాల అవసరాల కోసం 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తునం అని బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆదేశాలు జారీ చేశారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుండి స్కూల్ కి లక్ష రూపాయలు అందచేశారు. విద్యార్థులతో పాటు కూర్చొని ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. సంఘటన జరిగిన తల్లితండ్రులకు సమాచారం ఇవ్వని ప్రిన్స్ పాల్ తీరుపై మండిపడ్డరూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
స్థానిక పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో అభివృద్ధి నిరోధక పాలనే: విష్ణు వర్థన్ రెడ్డి
బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్థన్ రెడ్డి తిరుమలలో పర్యటిస్తున్నారు. తిరుమల శ్రీవారిని విష్ణు వర్థన్ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియా మాట్లాడుతూ... ఏపీ రాజకీయాలు దేశ ప్రజలలో ఆందోళన నింపుతున్నాయి అన్నారు. స్థానిక పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో అభివృద్ధి నిరోధక పాలనే సాగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పాలనతో ఆంధ్రప్రదేశ్ పదేళ్లు వెనక్కి పోగా, ఇప్పుడు వైసీపీ పాలనతో మరో ఇరవై ఏళ్లు అభివృద్ధిలో వెనక్కు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు
వైసీపీ చేతగానితనాన్ని ఎండగడతాం..
కుటుంబ పాలనే పరమావధిగా నాడు టీడీపీ, నేడు వైసీపీ వ్యవహరిస్తున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మిగిలిన ఈ 18 నెలలు వైసీపీ చేతగానితనాన్ని ఎండగట్టే విధంగా బీజేపీ, జనసేన ప్రజా అవగాహన ఉద్యమాలు చేపడుతున్నాయని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి పధంలో నడవాలి అంటే అది కేవలం బిజేపీ, జనసేనలతోనే సాధ్యం అన్నారు. తెలుగు రాష్ట్రాల విభజన తరువాత తెలంగాణలో టీఆర్ఎస్ ఆడుతున్న రాజకీయ క్రీడ ప్రమాదకరమైనది అన్నారు. సంతలో పశువుల్లా కొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గత మూడు రోజులుగా నీచ రాజకీయాలు చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. నేడు దేశంలో ఉనికి కోసం పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని, రాహుల్ గాంధీ చేపట్టి పాదయాత్ర భారత్ జోడో యాత్రను ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. 2024లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా సైతం దక్కదు అని జోస్యం చెప్పారు.
ఈ 31న రాజమండ్రిలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ
ఈ నెల 31న రాజమండ్రిలోని ఓ హోటల్‌లో వైఎస్‌ఆర్ సీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సమావేశంకానున్నారు. కాపు నేతల గురించి తాజాగా పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం వైఎస్‌ఆర్ సీపీ కాపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ లు రానున్నారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

