President Murmu in Hyderabad: రాష్ట్రపతి ముర్ముకు ఘనస్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి
President Murmu in Hyderabad: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హైదరాబాద్ వచ్చారు. 5 రోజులపాటు ఇక్కడ బస చేయనున్నారు.
President Draupathi Murmu Hyderabad Tour: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన రాష్ట్రపతి ముర్ము నగరంలోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్రపతి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సత్కరించారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పాటు ఇక్కడే బస చేస్తారు. ఇందుకోసం అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రపతి ముర్ము బస చేసే బొల్లారం చేరుకుంటారు. అక్కడ ఐదు రోజుల పాటు ఉంటారు. ఈ ఐదు రోజుల పాటు తెలంగాణలోని వివిధ ఫేమస్ ప్రాంతాలను ఆమె సందర్శిస్తారు. వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమవుతారు. సామాన్యులతో కూడా ముర్ము కలిసే అవకాశం ఉంది. బుధవారం ఆమె భూదాన్ పోచంపల్లిలో పర్యటిస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కాన్వాయ్ తో హైదరాబాద్ లోరిహార్సల్స్ నిర్వహించారు అధికారులు.
LIVE : Hon'ble President of India Smt. Droupadi Murmu Arrival at Begumpet Airport
— Revanth Reddy (@revanth_anumula) December 18, 2023
https://t.co/fxwnnUCuej
రాష్ట్రపతి ముర్ము పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఐదు రోజుల పాటు వివిధ జంక్షన్‌లు మూసివేయనున్నారు. హకీంపేట్ ఎయిర్‌పోర్స్ స్టేషన్ జంక్షన్, బొల్లారం చెక్‌పోస్టు, నేవీ జంక్షన్, యాప్రాలో రోడ్డు, హెలిప్యాట్ వై జంక్షన్, బైసన్ గేట్, లోతుకుంట టీ జంక్షన్ మూసివేస్తున్నట్టు అధికారులు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. వీటికి ప్రత్యామ్నాయ రూట్‌లలో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేస్తారు.
ఐదు రోజల పాటు హైదరాబాద్ లో రాష్ట్రపతి ముర్ము బస చేయనున్నారు. ఈనెల 23వ తేదీన ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రాష్ట్రపతి రాక సందర్భంగా హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.