తాగుబోతుల రాష్ట్రసమితిని బందిపోట్ల రాష్ట్ర సమితిగా మార్చారు: షర్మిల
వైఎస్ బిడ్డగా తన గుండెల్లో నిజాయితీ ఉందని ప్రజలకు సేవ చేయాలని తపన ఉందని వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకరావడానికి ప్రజలు తనను ఆశీర్వదించాలని వైఎస్సార్టిపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో మంగళవారం వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం 176 వ రోజు పాదయాత్ర కొనసాగింది. మంగళవారం ఉదయం హాసన్ పల్లి గేటుకు చేరుకొన్న షర్మిల పాదయాత్ర బొగ్గు గుడిసె మీదుగా సుల్తాన్ నగర్, నిజాంసాగర్ మండల కేంద్రానికి మధ్యాహ్నం చేరుకొంది. సుల్తాన్ నగర్‌లో వైఎస్ షర్మిల మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 108,104,ఆరోగ్య శ్రీ, రైతు రుణ మాఫీ లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్ పథకాలే నేటికీ నడుస్తున్నాయని అన్నారు.
వైఎస్ అంటేనే వ్యవసాయమని అభిప్రాయపడ్డారు. అనేక ప్రాజెక్టులు నిర్మించి లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారని విరించారు. ప్రజాప్రస్థానంలో భాగంగా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలో పాదయాత్ర చేస్తూ వైఎస్ నిర్మించిన నిజాంసాగర్ కాలువను పరిశీలించారు షర్మిల. ఆ కాలువ కింద నేటికీ రైతులు సంతోషంగా పంటలు పండించుకుంటున్నారన్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి ఇస్తానన్న కెసిఆర్ ప్రజలను మోసం చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కెసిఆర్‌కు గట్టిగా బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్‌టీపీకి అండగా నిలబడాలని జనాలకు రిక్వస్ట్ చేశారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా తన గుండెల్లో నిజాయితీ ఉందని ప్రజలకు సేవ చేయాలని తపన ఉందని వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్ళీ తీసుకరావడానికి ప్రజలు తనను ఆశీర్వదించాలని వైఎస్సార్టిపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అనంతరం ప్రతి మంగళవారం చేపట్టే నిరుద్యోగ దీక్ష శిబిరంలో వైఎస్ షర్మిల కర్చుని దీక్ష చేపట్టారు. రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న 2 లక్షల ఖాళీల నియామకం చేపట్టలంటూ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే తాగుబోతున రాష్ట్ర సమితని బందిపోట్ల రాష్ట్ర సమితిగా మార్చారని సెటైర్లు వేశారు షర్మిల.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అరాచకాలు తట్టుకోలేక ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థి జాజాల సురేందర్ కు ఓటేస్తే.. ఆ ఎమ్మెల్యే మళ్లీ టీఆర్‌ఎస్‌లో ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ చెప్పు కింద తాకట్టుపెట్టారని ఎల్లారెడ్డి సభలో ధ్వజమెత్తారు షర్మిల.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అరాచకాలు తట్టుకోలేక ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థి జాజాల సురేందర్ కు ఓటేస్తే.. ఆ ఎమ్మెల్యే మళ్లీ TRSలో చేరి, ఎల్లారెడ్డి ప్రజల ఆత్మగౌరవాన్ని KCR చెప్పు కింద తాకట్టుపెట్టాడు.
— YSR Telangana Party (@YSRTelangana) October 11, 2022
- ఎల్లారెడ్డి బహిరంగ సభలో వైయస్ షర్మిల గారు #PrajaPrasthanam #Yellareddy pic.twitter.com/ysmL4iAJIw
కేసీఆర్ పోలీసులను పనోళ్లలా వాడుకుంటున్నాడు. ఇక్కడ దోచుకోవడానికి ఏమీ లేదని, దేశం మీద పడ్డాడు. తాగుబోతుల రాష్ట్ర సమితి(TRS)ని బంధిపోట్ల రాష్ట్ర సమితి(BRS)గా మార్చాడు.
— YSR Telangana Party (@YSRTelangana) October 11, 2022
- ఎల్లారెడ్డి బహిరంగ సభలో వైయస్ షర్మిల గారు #PrajaPrasthanam #Yellareddy #YSSharmila #YSRTelanganaParty #YSRTP pic.twitter.com/wt2guHawNq