By: ABP Desam | Updated at : 18 Mar 2023 09:34 PM (IST)
రేవంత్ రెడ్డి, కేటీఆర్
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ టీఎస్ పీఎస్సీ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇక్కడ చదవని కేటీఆర్ కు తెలంగాణ కు ఏం సంబంధం? 610 జీవో, ముల్కీ రూల్స్ ప్రకారం కేటీఆర్ తెలంగాణలో చప్రాసి ఉద్యోగానికి కూడా పనికిరాడని అన్నారు రేవంత్ రెడ్డి. TSPSC పేపర్ లీక్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పీఏకు సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ దొంగలను కటకటాల్లోకి నెట్టాలని కామారెడ్డి పట్టణంలోని నిజాoసాగర్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్ లో అన్నారు రేవంత్.
ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని గాంధారి మండల కేంద్రంలో ఆదివారం నిరుద్యోగ నిరసన దీక్ష నిర్వహిస్తున్నానని తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ కామారెడ్డి బిడ్డ. వందలాది మంది ప్రాణత్యాగంతో తెలంగాణ తెచ్చుకుంటే... ఒరిగిందేమిటి? బొంబాయి, దుబాయి.. బొగ్గుబాయి అంటూ మాట్లాడిన కేసీఆర్.. ఇప్పుడు గల్ఫ్ బాధితులకు కేసీఆర్ ఏం చేశారు? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో గుంట నక్కలు కాంగ్రెస్ పార్టీని పీక్కు తిన్నా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు మద్దతుగా నిలవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉంది. మేకతోలు కప్పుకున్న తోడేలు లాంటోడు గంప గోవర్ధన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి ప్రజలను నట్టేట ముంచి ఎమ్మెల్యే అయ్యిండు. ఔటర్ రింగు రోడ్డు పేరుతో ప్రజల్ని నట్టేట ముంచాలనుకుంటున్నాడు. మీ పోరాటంతో వెనక్కు తగ్గాడు. మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తే మీ భూములను గుంజుకుని మిమ్మల్ని ఆగం చేస్తారని, తెలంగాణలో కాంగ్రెస్ గెలవాల్సిన చారిత్రక అవసరం ఉందని అన్నారు రేవంత్.
తొమ్మిదేళ్లుగా కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదన్నారు. మా పోరాట ఫలితంగా 80 వేల ఉద్యోగాలకు హడావుడిగా నోటిఫికేషన్లు ఇచ్చారు. కానీ సీఎం కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. మరోవైపు ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నారని ఆరోపించారు. ఇక్కడ చదవని కేటీఆర్ కు తెలంగాణ కు ఏం సంబంధం? 610 జీవో, ముల్కీ రూల్స్ ప్రకారం కేటీఆర్ తెలంగాణలో చప్రాసి ఉద్యోగానికి కూడా పనికిరాడని కామెంట్ చేశారు.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ ( TSPSC Paper Leak) వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పీఏకి సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయని చెప్పారు. తనకు సమాచారం తెలిసిందంటే అది కచ్చితంగా నిజమై ఉంటదన్నారు. మంత్రి పీఏకు సంబంధించిన సొంత మండలంలో పలువురు అభ్యర్థులకు భారీగా స్కోర్ వచ్చిందని ఆరోపించారు. పేపర్లు లీక్ చేసిన ఈ దొంగలను త్వరగా కటకటాల్లోకి నెట్టి అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. గాంధారి మండల కేంద్రంలో ఆదివారం నిరుద్యోగ నిరసన దీక్ష నిర్వహిస్తున్నాం అన్నారు. మార్చి 19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు దీక్షకు యువత, అభ్యర్థులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. 2004లో గెలిపించినట్టే, 2024లో 50వేలకు పైగా మెజారిటీతో షబ్బీర్ అలీని గెలిపించాలని కోరారు. ఆయన ఒక్క సంతకంతో ఎన్ని నిధులంటే అన్ని నిధులు ఇచ్చే కుర్చీలో కూర్చునేలా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని అన్నారు.
1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ
TSPSC Paper Leak: 'గ్రూప్-1' మెయిన్స్ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!
Alleti Maheshwar Reddy : ఆరు నెలల్లో ఐదు పార్టీలు మారిన చరిత్ర మీది, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డి కౌంటర్
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?