By: ABP Desam | Updated at : 19 Mar 2023 09:17 PM (IST)
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
TPCC Chief Revanth reddy: ఆత్మహత్యలు వద్దు.. ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.. మీ పక్షాన పోరాడుతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీ పరీక్షలు పరీక్షలు రద్దు చేయడం కాదు.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే నిరుద్యోగులు రద్దు చేసేందుకు సిద్ధం కావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 24, 25న విద్యార్థులు దీక్ష చేస్తామంటున్నారు. వారి దీక్షకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని రేవంత్ అన్నారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా ఆదివారం ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని జువ్వాడి గ్రేట్ నుంచి గాంధారి శివాజీ చౌరస్తా వరకు పాదయాత్ర చేపట్టారు.
కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలి
అనంతరం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడంతో పాటు కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండుతో గాంధారి మండల కేంద్రంలో చేపట్టిన నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్గొని రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబమో, బంధువులో, పార్టీ నేతల్లో ఒక్కరు కూడా ఆత్మ బలిదానం చేసుకోలేదన్నారు. 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నారని గుర్తుచేశారు. అమరులు కలలుగన్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసమే.. తొమ్మిదేళ్లయినా కేసీఆర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో లక్షా 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ చెప్పిండు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని మండిపడ్డారు.
ఏ త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందో.. ఆ తెలంగాణలో మళ్లీ నిరుద్యోగ ఆత్మహత్యలు చూస్తున్నాం. ఇది చాలా బాధాకరం అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఒక నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకుంటే తల్లిదండ్రులకు కడచూపు దక్కనివ్వలేదు. మానవ మృగాల్లా బీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ సమాజం మానవత్వం కోల్పోయిందా? తెలంగాణ మేధావులు ఎక్కడున్నారు? సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత నిర్బంధం చూడలేదు. ఈ నిర్బంధాల కోసమేనా మనం తెలంగాణ తెచుకున్నది? టీఎస్పీఎస్సీ లో ఆంధ్రాకు చెందిన ప్రవీణ్ కుమార్ కు ఎలా ఉద్యోగం ఇచ్చారు? సీఎం కేసీఆర్ ను సూటిగా ప్రశ్నిస్తున్నా? కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ఎలా నియమిస్తారు? అని అడిగారు.
వందల కోట్ల రూపాయలకు లక్షలాది నిరుద్యోగుల జీవితాలను తాకట్టు పెట్టారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రమేయం లేకుండా రాష్ట్రంలో ఏ కుంభకోణం జరగదని ఆరోపించారు. ఆనాడు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రెటరీ గా ఉన్న జనార్దన్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించారు. వీరంతా కలిసి 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. ఆత్మహత్యలు వద్దు.. ఆత్మస్థైర్యంతో కొట్లాడుదామని అన్నారు రేవంత్ రెడ్డి.
నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.. మీ పక్షాన పోరాడుతుంది. నేను మళ్లీ చెబుతున్నాను. సీఎం కేసీఆర్ టీఎస్ పీఎస్సీ పరీక్షలు రద్దు చేయడం కాదు.. ఆయన ప్రభుత్వాన్నే నిరుద్యోగులు రద్దు చేసేందుకు సిద్ధం కావాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 24, 25న విద్యార్థులు చేయనున్న దీక్షకు మద్దతు తెలిపారు. వారి దీక్షకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలికేక వినిపించేందుకు సిద్ధం కావాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు రేవంత్ రెడ్డి.
కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!
పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!
1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
KNRUHS Final MBBS Results: ఎంబీబీఎస్ ఫైనలియర్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్
Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత