Morning Top News:


ప్రజాపాలన ముగింపు కార్యక్రమాల షెడ్యూల్ ఇదే

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న వేళ ప్రజా పాలన విజయోత్సవాలను భారీగా నిర్వహిస్తోంది. ప్రజాపాలన ముగింపు ఉత్సవాలను ఈనెల 7, 8, 9వ తేదిల్లో నిర్వహించనున్నట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. 7న వందేమాతరం శ్రీనివాస్, 8న రాహుల్ సిప్లిగంజ్, 9న థమన్ టీంతో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేస్తారు. 9న లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరిస్తారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన

 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. 1000 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గ్రూప్ 4 నియామక పత్రాలు అందజేశారు. ఏడాదిలో 55,143 ఉద్యోగాలను అందించి దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

తరగతి గదిలో ఉపాధ్యాయుడు మృతి

అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ హైస్కూల్లో ఉపాధ్యాయుడు ఏజాస్‌ అహ్మద్‌ మృతిచెందాడు. తరగతి గదిలో విద్యార్థులు అల్లరి చేస్తుండగా వారిపై కేకలు వేసే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఉపాధ్యాయుడికి అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో.. కింద కూర్చొని అలానే పడిపోయాడు. ఉపాధ్యాయుడిని స్థానికులు వెంటనే రాయచోటి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

శ్రీవారి భక్తులకు శుభవార్త

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో లడ్డూ ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది.  టీటీడీ  భక్తులకు పరిమిత సంఖ్యలోనే లడ్డూలు అందిస్తోంది. దీనిపై భక్తుల్లో కొంత అసంతృప్తి నెలకొనగా.. టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. భక్తులు కోరినన్ని లడ్డూలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.  రద్దీ, డిమాండ్ దృష్ట్యా అదనంగా రోజుకు 50 వేల చిన్న లడ్డూలు, 4 వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారీకి టీటీడీ సిద్ధమవుతోంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

ట్రాఫిక్ వాలంటీర్లుగా  44 మంది ట్రాన్స్ జెండర్లు

తెలంగాణలో ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో నియామక ప్రక్రియ చేపట్టారు. 800 మీటర్స్, 100 మీటర్స్ రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఈవెంట్స్ నిర్వహించారు. 18 ఏళ్లు పూర్తైన వారు, టెన్త్ సర్టిఫికెట్, ట్రాన్స్‌జెండర్ సర్టిఫికెట్ ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ చేపట్టారు. బుధవారం 58 మంది పాల్గొనగా.. 44 మందికి ఎంపిక చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

సంక్రాంతి పండుగ వేళ రైల్వే శుభవార్త

సంక్రాంతి పండుగ వస్తుందంటే టికెట్ రిజర్వేషన్ పెద్ద సమస్యగా మారుతోంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లోప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, విశాఖ నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి ఒడిశాలోని బ్రహ్మపురకు, బ్రహ్మపుర నుంచి సికింద్రాబాద్ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనుంది. డిసెంబర్ 6 నుంచి 30వ తేదీ వరకు దక్షిణ మధ్య రైల్వే నడపనుంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

అస్సాం ప్రభుత్వ డేరింగ్ డెసిషన్


అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో బీఫ్ అమ్మడాన్ని నిషేధిస్తూ చట్టానికి సవరణలు చేశారు. నిజానిక గో సంరక్షణ చట్టం-2021 ప్రకారం ఆలయాలకు సమీపంలో మాత్రం బీఫ్ తినడాన్ని నిషేధించారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో బీఫ్ వంటకాలు అమ్మడాన్ని నిషేధించినట్లు అస్సాం ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


కుటుంబంలో విషాదం నింపిన పుష్ప 2 బెనిఫిట్‌ షో


పుష్ప-2 బెనిఫిట్‌ షో ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సంద్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.  ఈ దుర్ఘటనలో మరికొందరు కూడా గాయపడినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


సిక్సర్లతో హోరెత్తించిన IPL చిచ్చరపిడుగు సూర్యవంశీ


 13 ఏళ్ల భారత యువ సంచనలం వైభవ్ సూర్యవంశీ.. షార్జాలో జరుగుతున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో సిక్సర్లలో విధ్వంసం సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ.. షార్జాలో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ యూఏఈతో బుధవారం జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి 46 బంతుల్లోనే 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. 165కి పైగా స్ట్రైక్ రేటుతో సూర్యవంశీ పరుగులు సాధించడం విశేషం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


నో డౌట్స్... డాకు మహారాజ్ వచ్చేస్తున్నాడు

గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘డాకు మహారాజ్’. తాజాగా ‘డాకు మహారాజ్’ చిత్రీకరణ పూర్తయినట్లుగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ముందుగా ప్రకటించినట్లుగానే సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న విడుదల అంటూ స్పష్టం చేశారు. ‘డాకు ఇన్ యాక్షన్’ పేరుతో ఓ న్యూ పిక్‌ని కూడా వదిలారు. ఈ పిక్‌లో డైరెక్టర్ బాబీ, బాలయ్యకు సీన్ వివరిస్తూ కన్పించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

ఒక్కటైన నాగచైతన్య-శోబిత 

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వీరిద్దరికీ ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత ఘనంగా వివాహం జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలను అధికారికంగా సోషల్ మీడియాలో విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..