Pushpa 2 Dialogue Telugu: పుష్ప 2 రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు సందడి చేస్తున్నారు. వేలు ఖర్చు పెట్టి ప్రీమియర్ షోలు చూసిన వారంతా పుష్ప 2 సూపర్ హిట్ అంటున్నారు. పుష్ప2 విడుదలకు ముందు విడుదల తర్వాత జరుగుతున్న పరిణామాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. లేని సంభాషణలను సినిమాలో ఉన్నాయి అన్నట్టు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి, పవన్ కల్యాణ్, చంద్రబాబును టార్గెట్ చేస్తూ పుష్ప 2లో డైలాగ్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన చాలా డైలాగ్స్ సినిమాలో లేవు. అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ మధ్య ఉన్న గ్యాప్‌ను మరింత పెంచేందుకు ఇలా లేని డైలాగ్స్‌ను ప్రచారం చేస్తున్నట్టు ఉంది.
మీ బాస్‌కు నేనే బాస్‌ను అనే డైలాగ్ ఒకటి, నేను తగ్గాలని చాలా మంది చూస్తున్నారనే డైలాగ్ సినిమాలో ఉన్నాయి. కానీ స్నేహితుడి కోసం వస్తా... నువ్వు నీ బాపు ఆపలేరు అనే డైలాగ్ సినిమాలో లేదు. కానీ ఈ డైలాగ్ సినిమాలో ఉందని సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది.
ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఓ సీన్‌లో పుష్ప... మీ బాస్‌కే నేను బాస్‌ని అంటూ చెప్పిన డైలాగ్ కాస్త వివాదమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బాస్ అంటే ఇండస్ట్రీలో అందరూ చిరంజీవనే చూస్తారు. అలాంటిది ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌కి, అల్లు అర్జున్‌కి అసలు పడటం లేదు ఇలాంటి టైంలో బాస్ డైలాగ్ పెట్టడం వారిని మరింతగా కెలికినట్టే అవుతుందని అంటున్నారు. మరో సందర్భంలో నేను తగ్గాలని చాలా మంది చూస్తున్నారని పుష్ప క్యారెక్టర్‌తో చెప్పించే డైలాగ్ కూడా కథలో భాగంగానే ఉన్నట్టు ఉంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గుర్తు చేసేలా ఉందని అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్
కేశవ నా స్నేహితుడు. నా స్నేహితుడి కోసం నేను వస్తాను దానికి అడ్డు నువ్వు వచ్చిన నీ బాబు వచ్చినా మీ బాబాయ్ వచ్చిన. నన్నేం పీకలేరు. అంటూ పుష్ప 2లో డైలాగ్ ఉందని సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఇది సినిమాలో లేదు. మిగతా రెండు డైలాగ్స్ మాత్రం సినిమాలో కథకు తగ్గట్టుగానే ఉన్నప్పటికీ మెగా అభిమానులను మాత్రం రెచ్చగొట్టేలా ఉన్నాయి.
చిరంజీవి, పవన్ కల్యాణ్‌ను టార్గెట్‌గానే ఈ డైలాగ్ పెట్టి ఉంటారని చర్చించుకుంటున్నారు. ఏడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్నేహితుడి తరుఫున ప్రచారానికి వెళ్లిన అల్లు అర్జున్ తీవ్ర విమర్శల పాలు అయ్యారు. దీనిపై కేసు కూడా నమోదు అయింది. ఆ పరిస్థితిని గుర్తు చేస్తూనే ఈ డైలాగ్ పెట్టారనే వాదన తెరపైకి తీసుకొచ్చేందుకు లేని డైలాగ్స్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున నంద్యాల నుంచి శిల్పా రవి చంద్రారెడ్డి పోటీ చేశారు. తన స్నేహితుడైన రవిచంద్రారెడ్డికి మద్దతుగా నంద్యాలో అల్లు అర్జున్ పర్యటించారు. ఎవరికీ ఓటు వేయాలనే విషయం చెప్పకపోయినా తన స్నేహితుడి కోసం తాను వచ్చానంటూ మీడియాతో మాట్లాడారు. అప్పటికే వైసీపీకి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్, చంద్రబాబు కూటమిగా పోటీ చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ బరిలో ఉన్నారు. ఆయనకు మద్ధతుగా మెగా అభిమానులు, ఫ్యామిలీ మొత్తం ప్రచారం చేపట్టారు.
అలాంటి పరిస్థితిలో అల్లు అర్జున్ వైసీపీ నేత కోసం రావడం వివాదాస్పదమైంది. మెగా అభిమానులు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. అప్పటికే అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు జనసైనికులకు పడటం లేదు. ఈ ఘటనతో సీన్‌లోకి మెగా అభిమానులు కూడా రావడంతో సీన్ మారిపోయింది. రెండు వర్గాల మధ్య పెద్ద గ్యాప్ వచ్చింది. ఇప్పుడు పుష్ప 2 విడుదల సందర్భంగా అది మరింతగా పెరిగింది.
పుష్ప 2 ప్రమోషన్స్‌లో ఎక్కడా మెగా అంశాన్ని తీసుకురాకుండా కేవలం అల్లు అర్జున్ ఆర్మీ అంటూ ప్రచారం చేసుకోవడంపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మెగా శిబిరం నుంచి కూడా పుష్ప 2 కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. నాగబాబు మాత్రం నిన్న అన్ని సినిమాలు ఆడాలి అంటూ ఓ ట్వీట్ చేశారు. సినిమాలు అట్టుకుంటామనే ప్రకటనలు సరికాదని జనసైనికులకు ఓవరాల్‌గా చెప్పాారే తప్ప ఎక్కడా పుష్ప2 ప్రస్తావన చేయలేదు. ఓవైపు ఎన్నికల్లో జరిగిన రగడ, మరోవైపు అల్లు అర్జున్ కామెంట్స్ మెగా అభిమానులను మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఇప్పుడ దాన్ని అవకాశంగా తీసుకుంటున్న కొందరు లేని డైలాగ్స్‌ను సృష్టించి వారి మధ్య ఉన్న వివాదాన్ని వాడుకుంటున్నారు.
Also Read: పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?