CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజా పాలన విజయోత్సవాలు పేరిట రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా పెద్దపల్లిలో యువ వికాసం పేరిట ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువకుల గురించి మాట్లాడుతూ కామెంట్లు చేశారు. ఈ విషయంపై ఈయన సోషల్ మీడియా వేదికగా కూడా ట్వీట్ చేశారు.


ప్రజాపాలన ముగింపు ఉత్సవాల షెడ్యూల్ విడుదల..
ప్రజాపాలన ముగింపు ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను ఈనెల 7, 8, 9వ తేదిల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో భేటీ అయ్యారు. ఈనెల 7 నుంచి 9 వరకు ప్రముఖ హోటళ్లు, డ్వాక్రా సంఘాల 120 ఫుడ్, హస్తకకళల స్టాళ్లను పీవీ మార్గ్ లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 


సినీ తారాలతో మ్యూజికల్ నైట్..
సినీ సంగీత దర్శకులు, సింగర్లతో ఈనెల 7నుంచి 9 వకు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. 7న వందేమాతరం శ్రీనివాస్, 8న రాహుల్ సిప్లిగంజ్, 9న థమన్ టీంతో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 9న సచివాలయ ప్రాంగణంలో లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత భారీ డ్రోన్, లేజర్, క్రాకర్ షో కార్యక్రమాలు ఉంటాయి. తెలుగుతల్లి నుంచి పీవీ మార్గ్ ఫ్లై ఓవర్ వరకు 5 కేంద్రాల వద్ద వివిద ప్రొగ్రామ్స్ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 


Also Read: Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం


వేములవాడలో ప్రజాపాలన కార్యక్రమాల ఊసే లేదు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా బుధవారం రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో సుదర్శన, గణపతి, నవ గ్రహ చండీ హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహించగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో మాత్రం బుధవారం ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఇక్కడి అధికారులకు సమాచారం అందిందా లేక సమాచారం ఇచ్చినప్పటికీ ఆలయ అధికారులు మరిచిపోయారా అనే విషయం తెలియాల్సి ఉంది. 


దాటవేత సమాధానం..
మరోవైపు ఇదే విషయంపై ఆలయ అధికారులను సంప్రదించగా తమకు సమాచారం అందిందని, పూజలు చేస్తున్నామని తెలిపారు. అయితే పూజల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పేర్కొన్నప్పటికీ పూజల్లో వారు ఎక్కడ కనిపించకపోవడం, పూజలు చేసిన ఫోటోలు బయటకు రాకపోవడంతో అసలు నిజంగా ఆలయంలో పూజలు జరిగాయా లేదా అధికారులు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారా అనే అంశాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనా ఈ ప్రజాపాలన కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చింది. రాబోయే పంచాయతీ ఎన్నికలకు కేడర్ ను సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమం ఉపకరించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.