Balakrishna Starring Daku Maharaj Film Wrapped Up | గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి నటసింహం బాలయ్య, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘డాకు మహారాజ్’. ఇటీవలే ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ఓ టీజర్ వదిలారు. ఈ టీజర్‌తో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే అంతకు ముందు ఈ సినిమాపై రకరకాలుగా వార్తలు వచ్చాయి. బాబీ విషయంలో బాలయ్య సంతృప్తిగా లేరని, ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని, సంక్రాంతికి విడుదల కష్టమే అనేలా.. ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలన్నింటినీ ఎప్పుటికప్పుడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తోసిపుచ్చుతూనే ఉన్నారనుకోండి. అయినా సరే.. ఎక్కడో చిన్న అనుమానం ఫ్యాన్స్‌లో ఉండిపోయింది. ఆ అనుమానాలకు తెరదించుతూ.. బుధవారం అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఏంటా అప్డేట్ అనుకుంటున్నారా..
Also Read: పుష్ప 2 సెన్సార్ బోర్డు రివ్యూ... అల్లు అర్జున్ సినిమాలో హైలైట్స్ ఏంటో తెలుసా?
‘డాకు మహారాజ్’ చిత్రీకరణ పూర్తి
ఏం లేదు.. సినిమా సంక్రాంతికి వస్తుందా? అనే అనుమానులున్న వారందరికీ క్లారిటీ ఇస్తూ.. ‘డాకు మహారాజ్’ చిత్రీకరణ పూర్తయినట్లుగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు, ముందుగా ప్రకటించినట్లుగానే సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న విడుదల అంటూ స్పష్టం చేశారు. ఈ విషయం తెలుపుతూ ‘డాకు ఇన్ యాక్షన్’ పేరుతో ఓ న్యూ పిక్‌ని కూడా వదిలారు. ఈ పిక్‌లో డైరెక్టర్ బాబీ, నటసింహానికి సీన్ వివరిస్తుంటే.. నటసింహం తీక్షణంగా బాబీ వైపే చూస్తున్నారు. ఆ వివరణ చూస్తుంటే.. సినిమాలో ఇదొక కీలక సన్నివేశమనేది అర్థమవుతోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో హాస్పిటల్‌ను గమనించవచ్చు.
ఇక చిత్రీకరణ పూర్తయింది కాబట్టి.. ఇంక సినిమా విడుదలకు దాదాపు 40 రోజుల సమయమే ఉండటంతో.. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ శరవేగంగా పూర్తి చేసేలా బాబీ అండ్ టీమ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. బాబీ వర్క్ పక్కా ప్రణాళికాబద్ధంగా ఉంటుంది (ఈ విషయం ‘వాల్తేరు వీరయ్య’ సమయంలో మెగాస్టార్ చిరంజీవే స్వయంగా ప్రకటించారు) కావున.. సంక్రాంతి బరిలోకి నటసింహం దిగడంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు.
‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి వరుస హిట్స్‌తో హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య.. ఈ ‘డాకు మహారాజ్’తో మరో హ్యాట్రిక్‌కు శ్రీకారం చుట్టడం కాయం అనేలా.. ఇప్పటికే టీమ్ చెబుతూ వస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అదే విషయాన్ని తెలియజేస్తుంది. బాలయ్యను సరికొత్తగా బాబీ ప్రజంట్ చేస్తున్నారు. బాలయ్య కెరీర్‌లోనే ఇదొక గొప్ప చిత్రంగా నిలిచిపోతుందని నాగవంశీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సంగీత దర్శకుడు థమన్ అయితే.. తాండవమాడేస్తున్నాడు కూడా. బాలయ్య అంటే చాలు.. ఆయనకు పూనకాలు వచ్చేస్తాయి.
అఖండకు మించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్
‘అఖండ’కు ఎలాగైతే బాక్సులు బద్దలయ్యాయో.. ఈ సినిమాకు కూడా అంతకు మించి అనేలా థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నట్లుగా టాక్ వినబడుతోంది. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ బాలీవుడ్, కోలీవుడ్‌లలో బాగా వినిపించిన బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Also Read: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?