కన్నడ సినిమాల నుంచి టాలీవుడ్ లోకి ‘ఛలో’ సినిమా ద్వారా అడుగుపెట్టారు రష్మిక. ఆమె రెండో సినిమా ‘గీత గోవిందం’. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక, ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు రష్మిక. ఆమె నటించిన ‘పుష్ప 2’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘కిరాక్ పార్టీ’ నుంచి ‘యానిమల్’ వరకు ఆమె నటించిన ఏ సినిమా, ఏ ఓటీటీలో ఉందో చూసేద్దాం.


మొదటి సినిమా తోనే సూపర్ హిట్


‘కాంతారా’ ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా ‘కిరాక్ పార్టీ’. ఈ సినిమాతో రష్మిక అక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యారు. ఈ సినిమా ను నిఖిల్ హీరోగా తెలుగులో రీమేక్ చేశారు. ఈ కన్నడ ‘కిరాక్ పార్టీ’ ‘జియో సినిమా’ లో అందుబాటులో ఉంది.


మేడమ్ ‘స్టార్’ అయ్యారు


అర్జున్ రెడ్డితో బోల్డ్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ సినిమాతో ఫ్యామిలీ స్టార్ అయ్యారు. బన్నీ వాస్ నిర్మాణంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కిన ఈ సినిమా లో హీరోయిన్ రష్మిక కేరక్టర్ ను ‘‘మేడమ్ మేడమ్...’’ అంటూ బతిమాలడం హైలైట్ అయింది. పరశురామ్ రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రష్మిక ను స్టార్ చేసింది. ఇక ఆమె స్టార్ హీరోయిన్ గా దక్షిణాది సినిమాల్లో బిజీ అయిపోయారు. ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ (ఉచితం), జీ5 యాప్ లలో అందుబాటులో ఉంది.


సూపర్ స్టార్ తో సూపర్ హిట్


‘అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దేవదాస్’, డియర్ కామ్రేడ్’ లు ఫ్లాప్ లతో కాస్త డల్ అయిన రష్మిక కెరీర్ ను మళ్లీ గాడిలో పెట్టిందీ సినిమా. మహేశ్ బాబు  హీరోగా నటించిన  ఈ సినిమా మంచి విజయం సాధించింది. ‘‘మీకు అర్థం అవుతోందా’’ అంటూ రష్మిక చెప్పే డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2020 సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


పాన్ ఇండియా క్రేజ్


‘పుష్ప’ సినిమాతో రష్మిక పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ శ్రీ వల్లి కేరక్టర్ లో రష్మిక తన నటనతో ఎంతో ఆకట్టుకున్నారు. ‘పుష్ప 2’ లో కూడా ఆమె పాత్ర పరిధి మరింత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.


హీరోయిన్ కాదు కానీ...


సాధారణంగా స్టార్ హీరోయిన్లు సైడ్ రోల్స్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఆ ట్రెండ్ ను  బ్రేక్ చేస్తూ, రష్మిక సీతారామం సినిమాలో కీలక పాత్ర చేశారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు. తెలుగు ఒరిజినల్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక, హిందీ వెర్షన్ డిస్నీ హాట్ స్టార్ యాప్ లో ఉంది.


Also Read'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?



బాలీవుడ్ లోకి ఎంట్రీ


అమితాబ్ బచ్చన్ సినిమా ‘గుడ్ బై’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తర్వాతి హిందీ సినిమా ‘మిషన్ మజ్ను’ కూడా ఫ్లాప్ అయింది. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ ద్వారా ఆమె కెరీర్ మళ్లీ ఊపందుకుంది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ వంద కోట్లకు పైగా కొల్లగొట్టింది నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా తెలుగు, కన్నడ, మలయాళ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.


వారిసు (తెలుగు లో వారసుడు) - అమెజాన్ ప్రైమ్


ఛలో (తెలుగు) -సన్ నెక్స్ట్


దేవదాస్  (తెలుగు) -జీ5


డియర్ కామ్రేడ్ (తెలుగు)  -అమెజాన్ ప్రైమ్


పొగరు (తెలుగు) – ఆహా తెలుగు


సుల్తాన్ (తెలుగు) – ఆహా తెలుగు


ఆడవాళ్లు  మీకు జోహార్లు (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ)- సోనీలివ్


గుడ్ బై (హిందీ) – నెట్ ఫ్లిక్స్


మిషన్ మజ్ను(హిందీ) నెట్ ఫ్లిక్స్


Also Readపుష్ప 2 సెన్సార్ బోర్డు రివ్యూ... అల్లు అర్జున్ సినిమాలో హైలైట్స్ ఏంటో తెలుసా?