Leela Vinodam OTT Release: ‘ఆయ్’, ‘కమిటీ కుర్రాళ్లు’లా స్వచ్చమైన పల్లెటూరి కథ - ETV Winలో షన్ను సిరీస్, స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా?

Leela Vinodam on EtvWinయూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'లీలా వినోదం'. ఈటీవీ విన్ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ సిరీస్ ఇది. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

Continues below advertisement

Leela Vinodham Web Series Release Date: ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ పల్లెటూరి ప్రేమకథలు, అక్కడి మనషులు, వారి జీవితాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఆయ్’, ‘కమిటీ కుర్రాళ్లు’ లాంటి సినిమాలు ఇలాంటి పల్లె సినిమాలే.  చిన్న బడ్జెట్ తో తీసినవే అయినా పెద్ద విజయం సాధించాయి. మంచి వసూళ్లు రాబట్టాయి. ఇటువంటి నేపథ్యంలోనే రూపొందిన ఓ వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీలో రానుంది. అచ్చమైన పల్లెటూరి ప్రేమకథగా ‘లీలా వినోదం’ అనే వెబె సిరీస్ ను రూపొందించారు దర్శకుడు పవన్ సుంకర.

Continues below advertisement

ఈటీవీ విన్ లో లీలా వినోదం

యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ గోపరాజు రమణ, అనగ అజిత్, ఆమని ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలు పోషించారు. ఈ నెల అంటే డిసెంబర్ 19 నుంచి ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఎందుకు చెప్పలేదంటే....

రెండు నెలల క్రితం విడుదలైన టీజర్ లో ప్రసాద్ గాడి వీర ప్రేమగాథ ఏంటో చెప్పారు దర్శకుడు. ప్రసాద్ చదువుకుంటున్న సమయంలో... అంటే 2005 నాటి రోజులకు తీసుకెళ్లారు. స్మార్ట్ ఫోన్లు లేని ప్రపంచంలో, కేవలం చిన్న పాటి నోకియా ఫోన్ ఉంటే గొప్ప అనుకునే అమాయకమైన రోజుల్లో , అందమైన పల్లెటూర్లో  ప్రసాద్ తన మనసులో రాసుకున్న  ప్రేమకథ ఇది. ఎప్పటి నుంచో చూపుల్లో ఉన్న ప్రేమను, మాటల్లో ఆ అమ్మాయికి వ్యక్తం చేయాలనుకుంటాడు. కానీ చెప్పలేకపోతాడు. కారణం ఏంటి? అనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ లో చూడాల్సిందే.

Also Read: అల్లు అర్జున్ గుండెల మీద కాలేసిన రష్మిక... ఇప్పుడేమంటారు ట్రోలర్స్?

Shanmukh Jaswanth Kandregula: యూట్యూబ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ స్టార్ కింద షణ్ముఖ్ జస్వంత్ ఒక వెలుగు వెలిగాడు. అయితే అతని మీద వరుస వివాదాలు వచ్చాయి. హిట్ అండ్ రన్ కేసు అతని ఇమేజ్ కొంత తగ్గించిందని చెప్పాలి. ఆ తరువాత గంజాయి కేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. ఇవన్నీ పక్కన పెడితే... నటుడుగా షణ్ముఖ్ జస్వంత్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

'బేబీ' సినిమాతో పాపులర్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా తొలుత యూట్యూబర్. షణ్ముఖ జస్వంత్ సరసన సాఫ్ట్వేర్ డేవ్ లవ్ పర్ సిరీస్లో ఆమె నటించింది. అది ఆవిడకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది ఆ తరువాత అల్లు అర్జున్ చెల్లెలిగా అలవైకుంఠపురంలో సినిమాలో కనిపించింది.‌ అది చిన్న పాత్ర. ఆవిడకు గుర్తింపు రాలేదు. షణ్ముఖ్ జస్వంత్ హీరోగా నటించిన యూట్యూబ్ వెబ్ సిరీస్ సూర్య కూడా సూపర్ హిట్.

Also Read:'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?

Continues below advertisement