'పుష్ప 2'లో పీలింగ్స్ సాంగ్ రిలీజ్ అయింది. రికార్డు వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతుంది అ సాంగ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,నేషనల్ క్రష్ రష్మిక ఈ పాట కోసం వేసిన స్టెప్పులు ఫ్యాన్ ఇండియా స్థాయిలో వ్యూవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకించి రష్మిక అల్లు అర్జున్ ఛాతిపై అరికాలు ఉంచి వేసే స్టెప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఒక స్టార్ హీరో గుండెలపై హీరోయిన్ అలా అరికాలు ఉంచడానికి ఎలాంటి ఈగో లేకుండా ఆ హీరో ఒప్పుకోవడం నిజంగానే చాలా గొప్ప పని అంటూ బన్నీని పొగుడుతున్నారు సోషల్ మీడియాలో మీడియా లో. అయితే ఈ సమయంలో గతంలో ఇలాంటి ఇష్యూస్ పైనే జరిగిన కొన్ని వివాదాలు గురించి మాట్లాడుకోవాలి.
మహేష్ బాబు సినిమా పై అనవసరంగా విమర్శ చేసిన సమంత
గతంలో మహేష్ బాబు, సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన 'వన్ -నేనొక్కడినే' సినిమా పోస్టర్ విషయంలో బీచ్ లో మహేష్ బాబు నడుస్తూ ఉంటే వెనకాలే హీరోయిన్ కృతి సనన్ ఒంగొని వెళుతూ ఉన్న స్టిల్ ను స్టార్ హీరోయిన్ సమంత ఆడవాళ్ళని చులకన చేయడం మానుకోవాలి అన్నట్టుగా ట్విట్ చేయడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ ట్వీట్ ని బేస్ చేసుకుని కొంతమంది మహేష్ బాబును, సినిమా టీం ను విమర్శించారు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మేల్ ఇగో ఎక్కువ అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేశారు. అయితే దీనిపై మహేష్ బాబు గాని, డైరెక్టర్ సుకుమార్ గాని ఎలాంటి ప్రతి విమర్శ చేయలేదు. కానీ ఆ తర్వాత మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' సినిమాలో తనకు పొరపాటున తగిలిన హీరోయిన్ శృతిహాసన్ కాలును పర్వాలేదన్నట్టుగా మహేష్ బాబు చేత్తో పట్టుకుని మరీ తన కు తగిలేలా పెట్టుకోవడం ఆ పాత కాంట్రవర్శి కి సమాధానం చెప్పడానికే అని మహేష్ బాబు ఫ్యాన్స్ అప్పట్లో వైరల్ చేశారు.
అక్కినేని అఖిల్ కూడా అదే బాటలో
అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశమే ఉంది. హీరోయిన్ పూజ హెగ్డే తన అరికాలితో అఖిల్ చెవి వెనకాల తాకుతున్నట్టు ఒక స్టిల్ ను రిలీజ్ చేశారు. చాలా రొమాంటిక్ గా ఉండే ఆ పోస్టర్ యూత్ లో బాగా వైరల్ అయింది. ఇప్పుడు మేల్ ఈగో ఆరోపణలకు అడ్డు చెబుతూ పీలింగ్స్ సాంగ్ తో సమాధానం ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్.
Also Read:'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?
తాజాగా రిలీజ్ అయిన 'పుష్ప ది రూల్'లోని 'పీలింగ్స్...' పాటతో సుకుమార్ గతంలో వచ్చిన విమర్శలకు చెక్ పెట్టేసారు. ఏకంగా రష్మిక అరికాలను అల్లు అర్జున్ గుండెల పై ఉంచుతూ వేసిన స్టెప్ ఫ్యాన్స్ లోకి బాగా వైరల్ అయింది. అంతకుముందు రిలీజ్ చేసిన ట్రైలర్ లో కూడా రష్మిక కాలుపట్టుకుని తన గడ్డంపై రాయిస్తూ "తగ్గేదే లే " అంటూ అల్లు అర్జున్ చేసిన గెచ్చర్ కూడా బాగా క్లిక్ అయింది. ఓవరాల్ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కల్చర్ చాలా ఎక్కువ అనీ, హీరోయిన్స్ ని చాలా తక్కువగా చూస్తారు అంటూ గతంలో కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. కానీ ఇండస్ట్రీలో అలాంటివి ఉండవని పాత్రను బట్టి, కథను బట్టి కొన్ని ఫోజులు, స్టిల్స్ ఉంటాయని చెప్పడానికి డైరెక్టర్ సుకుమార్ ప్రయత్నించారనేది ప్రస్తుతం వినిపిస్తున్న విశ్లేషణలు. బన్నీ లాంటి పాన్ ఇండియన్ స్టార్ 'పుష్ప 2 ' లాంటి క్రేజీ ప్రాజెక్టు లో ఇలాంటి సీన్స్ కి అలాంటి అభ్యంతరం పెట్టకుండా ఓకే చెప్పడం కూడా చాలా మంచి పరిణామం అని సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.