వెండితెరపై ఓ వెలుగు వెలగాలన్నా, అభిమానుల గుండెల్లో అందాల కలల రాణిగా స్థానాన్ని దక్కించుకోవాలన్నా సరే... హీరోయిన్లకు కొన్ని బ్యూటీ స్టాండర్డ్స్ ఉండాల్సిందే. లేదంటే కొంతమంది చేసే కామెంట్స్ కి వాళ్లు డిప్రెషన్లో మునిగిపోక తప్పదు. రియాల్టీలో ఎలా ఉన్నా సరే తెరపై మాత్రం అందంగా, సన్నజాజితీగలాగా మెరవాలి. అలా లేని హీరోయిన్లు ఎంతోమంది దారుణమైన బాడీ షేమింగ్ ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తమన్నా 'జైలర్'లో చేసిన 'కావాలా...' సాంగ్ రిలీజ్ అయ్యాక తనను బిగ్, ఫ్యాట్ అంటూ కామెంట్స్ చేశారని గుర్తు చేసుకుంది.
తాజా ఇంటర్వ్యూలో తమన్నా బ్యూటీ స్టాండర్డ్స్ గురించి ఓపెన్ అయింది. నీరజ్ పాండే రూపొందించిన 'సికిందర్ కా ముఖద్దర్'లో తమన్నా కనిపించింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తమన్నా మాట్లాడుతూ మహిళల గురించి అన్ రియలిస్టిక్ బ్యూటీ స్టాండర్డ్స్ గురించి, అలాగే గతంలో తను ఆ బ్యూటీ స్టాండర్డ్స్ ఫాలో అవ్వడానికి ఎంత ప్రెజర్ ను ఎదుర్కొందో వివరించింది. చిన్నప్పుడు ఫిట్ గా ఉండడం అంటే సన్నగా ఉండడమేనని అనుకున్నానని చెప్పుకొచ్చింది. ఇక 'సినిమాలు చేస్తున్నప్పుడు అలా ఉండడానికి చాలా ప్రెజర్ తీసుకున్నాను. కానీ ఒకానొక టైంలో సన్నగా ఉండడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని అనిపించింది. అది నాకు అందమైన అనుభూతిని కలిగించలేదు. నిజంగా నా గురించి నేను అందంగా ఉన్నానని చాలా అరుదుగా భావించేదాన్ని. అందంగా ఉండడానికి, సన్నగా ఉండడానికి అసలు ఏ మాత్రం సంబంధం లేదు అనే విషయాన్ని తరువాత అర్థం చేసుకున్నాను. నా శరీరాన్ని నేను అంగీకరించడానికి 'ఆజ్ కి రాత్' సాంగ్ సహాయపడిందని అనిపిస్తుంది'' అంటూ చెప్పుకొచ్చింది.
Also Read: నాగ చైతన్య - శోభిత పెళ్లి... ముహూర్తం, వేదిక నుంచి అతిథులు వరకు - ఈ వివరాలు తెల్సా?
"కావాలా సాంగ్ రిలీజ్ అయ్యాక ఓ మహిళ, ఓ పార్టీలో నా దగ్గరికి వచ్చింది. ఆమె థాంక్స్ చెప్తూ... మీ వల్ల కర్వ్డ్ బాడీ షేప్ ఉన్న అమ్మాయిలను యాక్సెప్ట్ చేయగలిగారు చాలామంది. మీరు బిగ్ అండ్ ఫ్యాట్ గా ఉన్నప్పటికీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పింది" అని గుర్తు చేసుకుంది తమన్నా. అంతేకాకుండా ఫస్ట్ టైం ఒక మహిళ తన దగ్గరకు వచ్చి లావుగా ఉన్నావని చెప్పడంతో, అసలు ఆమె ఏం చెప్తుందో నమ్మలేకపోయానని వివరించింది తమన్నా. అయితే ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్, కెమెరా ఉన్నాయని, ప్రతి ఒక్కరు ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను పోస్ట్ చేస్తున్నారని తాను అర్థం చేసుకున్నానని, కాబట్టి ఈ తరంలో ప్రతి ఒక్కరికి ఆ ఒత్తిడి ఉంటుందని చెప్పుకొచ్చింది.
అయితే తాను ఒక నటిని కాబట్టి, కెరీర్లో మొదట్లో అలా ఉండడం తన ఉద్యోగంలో భాగమని చెప్పుకొచ్చింది తమన్నా. అయితే ఇప్పుడు తాను ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడం వల్ల అందానికి కొలమానం ఉండదని వెల్లడించారు. అందానికి, ఎంత సన్నగా ఉన్నారు అనేదానితో సంబంధం ఉండదని చెప్పుకొచ్చింది. ఇక సహజంగా తాను దుస్తులు ధరించినప్పుడు, కొన్నిసార్లు మేకప్ లేదా జుట్టు స్టైల్ చేయకపోయినా అందంగా కన్పిస్తానని ఎఏ సందర్భంగా చెప్పుకొచ్చింది తమన్నా. అంటే సహజత్వమే నిజమైన అందం అంటోంది మిల్కీ బ్యూటీ.
Also Read: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?